Hindu marriage rituals | సనాతన ధర్మంలో ఉన్న పెళ్లిపద్ధతులేమిటి? భూతశుద్ధి వివాహం ఉందా?
భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? పంచభూతాల శుద్ధీకరణపై ఆధారమైన ఈ యోగిక వివాహ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దేవి పతకం ఎందుకు ధరిస్తారు? లింగ భైరవి ఎవరు? పురాణాలు, ఆగమాలు, యోగ శాస్త్రాల్లో భూతశుద్ధి వివాహం సనాతన ధర్మ రీతి కాదు. యోగ–తంత్ర భావనల ఆధారంగా సద్గురు రూపొందించిన ఆధ్యాత్మిక వివాహ క్రతువు.
Bhuta Shuddhi Vivaha Is NOT an Ancient Ritual: True Origins & Meaning Explained
భూతశుద్ధి వివాహం — సారాంశం
భూతశుద్ధి వివాహం — ఇది పురాణాలకు నేరుగా చెందిన పెళ్లి పద్ధతి కాకపోయినా, పురాణ–యోగ–తంత్ర మూలాలతో రూపుదిద్దుకున్న ఒక ఆధునిక ఆధ్యాత్మిక వివాహ విధానం. పంచభూతాల సమతుల్యం, దేవి అనుగ్రహం, ధ్యాన శక్తి — ఈ మూడు పునాదులపై “భూతశుద్ధి వివాహం” ప్రత్యేకత నిలుస్తుంది.
- భూతశుద్ధి వివాహం అనేది లేదు
- ఇది పూర్తిగా సద్గురు జగ్గీవాసుదేవ్ సృష్టి
- సనాతన ధర్మ శాస్త్రాలలో ఎక్కడా ప్రస్తావన లేదు
- భూతశుద్ధి మాత్రం ఉపాసనకు ముందు ప్రక్రియ
(విధాత ప్రత్యేకం)
తెలుగు, హిందీ సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటి సమంత (Samantha Ruth Prabhu) జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టింది. సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్‌లో లింగ భైరవి దేవి సన్నిధిలో ఆమె—దర్శకుడు రాజ్ నిడిమోరును ‘భూతశుద్ధి పద్ధతి’లో వివాహం చేసుకుంది. తన ఇన్స్టాలో పంచుకున్న ఫోటోలలో సమంత చేతిలో ప్రత్యేకంగా ధరించిన ఉంగరం, మెడలో సంప్రదాయ మంగళసూత్రం స్థానంలో కనిపించిన నల్ల పూసల దేవి పతకం అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలేంటీ భూతశుద్ధి వివాహం? సనాతన ధర్మ వివాహ రీతుల్లో ఇది ఉందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇషా ఫౌండేషన్ ప్రకటన ప్రకారం, భూతశుద్ధి అనేది యోగాన్విత ప్రాచీన ప్రక్రియ; పంచభూతాల (ఆకాశం, నేల, నీరు, నిప్పు, వాయువు) శుద్ధీకరణ ద్వారా దంపతులలో ఆధ్యాత్మిక సమన్వయం స్ధాపించడమే దాని లక్ష్యం. లింగ భైరవి దేవి ఆశీర్వాదంతో, అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ వివాహ ప్రక్రియ సంప్రదాయానికి అనుగుణంగా, పూజాక్రతువు ద్వారా వధూవరుల శరీర, మనో స్థాయిలను ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశం.

ఫోటోల్లో స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే, సమంత ధరించిన దేవీ పతకం. సంప్రదాయ మంగళసూత్రం కాకుండా ఆ స్థానంలో ఈ దేవీ పతకం ఉంది. నవ దంపతులు ఈ దేవీ పతకం ధరించడం తప్పనిసరిగా ఇషా కేంద్రం పేర్కొంది. అయితే దంపతులు కోరుకున్నట్లైతే మంగళసూత్రాన్ని కూడా వధువుకు కట్టవచ్చు. సమంత ఈశా కేంద్రంతో కొంతకాలంగా కలిసి ప్రయాణిస్తోంది. తనకు ఇషా యోగా ప్రక్రియ, సద్గురు జగ్గీవాసుదేవ్()తో సత్సంబంధాలు ఉండటం తనను ఈ వైవాహిక రీతికి ప్రేరేపించిఉండవచ్చని అనుకుంటున్నారు. పుట్టుకతో క్రిస్టియన్ అయిన సమంత ఇంతకుముందు నాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు క్రైస్తవ, హిందూ సంప్రదాయ పద్ధతులు రెండూ పాటించారు.
అసలు భూతశుద్ధి వివాహం అనే పద్ధతి ఉందా?
అసలేంటీ భూతశుద్ధి వివాహం? సనాతన ధర్మ వివాహ రీతుల్లో ఇది ఉందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇషా ఫౌండేషన్ ప్రకటన ప్రకారం, భూతశుద్ధి అనేది యోగాన్విత ప్రాచీన ప్రక్రియ; పంచభూతాల (ఆకాశం, నేల, నీరు, నిప్పు, వాయువు) శుద్ధీకరణ ద్వారా దంపతులలో ఆధ్యాత్మిక సమన్వయం స్ధాపించడమే దాని లక్ష్యం. లింగ భైరవి దేవి ఆశీర్వాదంతో, అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ వివాహ ప్రక్రియ సంప్రదాయానికి అనుగుణంగా, పూజాక్రతువు ద్వారా వధూవరుల శరీర, మనో స్థాయిలను ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశం.
భూతశుద్ధి వివాహం అనేది యోగ, తాంత్రిక సంప్రదాయాల నుంచి సద్గురు జగ్గీవాసుదేవ్ ప్రత్యేకంగా రూపకల్పన చేసిన విధానం. ఇషా ఫౌండేషన్() వివరణలో ఇది పెళ్లికి సంబంధించిన ‘యోగా విధాన ప్రక్రియ’గా పేర్కొనబడింది. దంపతుల మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు, శరీర స్థాయిలను పంచభూతాల శుద్ధి ద్వారా లోతైన బంధాన్ని ఏర్పరుస్తుందని సద్గురు నమ్మకం. ఇది పూర్తిగా ఇషా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించబడే పద్ధతి.
“భూతశుద్ధి వివాహం” అనే ప్రయోగం లేదా పద్ధతి, సనాతన ధర్మానికి సంబంధించి, పురాణాలు, శాస్త్రాలు, ధర్మసూత్రాలలో ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించబడలేదు.

పురాణాల్లో ‘భూతశుద్ధి’ ఉంది — కానీ ‘భూతశుద్ధి వివాహం’ లేదు
భూతశుద్ధి అనే ప్రస్తావన పురాణాలు, తంత్ర, యోగ శాస్త్రాలలో కనిపిస్తుంది. దాని అర్థం:
- శరీరం–మనస్సు–ప్రాణాన్ని పంచభూతాల ద్వారా శుద్ధి చేయడం
- దేవతారాధన ముందు చేసే అంతర్యాగ శుద్ధి
- మంత్రసిద్ధి, ధ్యానం, యోగసాధనలో భూత శుద్ధి మొదటి దశ
కానీ, ఏ పురాణం, ఉపనిషత్తు, స్మృతి గ్రంథాలలో ఎక్కడా “భూతశుద్ధి వివాహం” అనే పెళ్లి పద్ధతి పేర్కొనబడలేదు. వరాహ పురాణం, స్కాంద పురాణం, శైవాగమాలు, తాంత్రిక గ్రంథాలు.. ఇలా ఏ గ్రంథాలు చూసినా “వివాహం”కి సంబంధించిన పద్ధతుల్లో ఇది లేదు.
సంప్రదాయ సనాతన ధర్మంలో పెళ్లి పద్ధతులు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. మనుస్మృతితో సహా ధర్మశాస్త్రాలు 8 విధాల వివాహా రీతులను ప్రస్తావిస్తాయి.
బ్రహ్మో-దైవస్తథైవర్షః
ప్రజాపత్య-స్తథా ‘సురః
గంధర్వో రాక్షసశ్చైవ
పైసావస్తమః స్మృతః
—- మనుస్మృతి, 3. 21
అవి.. బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచ పద్ధతులు. ఇందులో “భూతశుద్ధి వివాహం” లేదు. లేదా అటువంటి పద్ధతిని అనుసరించే విధానమేదీ చెప్పబడలేదు.
ఇంతకీ “భూతశుద్ధి” ఎక్కడ ఉంది?
పురాణాలు & ఆగమాలలో “భూతశుద్ధి” అనే పదం ఇలా వస్తుంది:
1️⃣ శైవ ఆగమాలు – పూజకు ముందు భూత శుద్ధి
విగ్రహారాధన/లింగారాధన ప్రారంభించే ముందు:
- ఆవాహనం, ప్రాణప్రతిష్ఠ
- పంచభూతాల శుద్ధి
- శరీరం, ప్రాణ, మనస్సు శుద్ధీకరణ
2️⃣ తంత్ర శాస్త్రం – అంతర్గత యాగం
తంత్రము భూతశుద్ధిని ఒక శక్తివంతమైన అంతర్యాగం, శరీర శుద్ధి పద్ధతిగా పేర్కొంటుంది.
3️⃣ యోగ శాస్త్రం
యోగాలో భూతశుద్ధి అనేది:
- నాడీసుధ్ధి
- పంచభూతాల సమతుల్యం
- ధ్యానానికి సిద్ధమైన ఆత్మస్థితి
అంటే ఏమిటి?
భూతశుద్ధి అనేది పురాణకాలం నుంచి ఉన్న యోగిక–తాంత్రిక పద్ధతి. కాని “భూతశుద్ధి వివాహం” అనే పెళ్లి పద్దతి మాత్రం పురాణాల్లో అసలు లేదు. ఇది ఆధునిక యోగ సంస్థలు (ప్రత్యేకంగా ఇషా ఫౌండేషన్) రూపొందించిన యోగ ఆధారిత పెళ్లి క్రతువు.
‘లింగ భైరవి’ గురించి?

లింగ భైరవి దేవి — పురాణాల్లో “భైరవి” దేవి రూపం ఉంది. కాని లింగ రూపంలోని భైరవి దేవి అనేది సద్గురు ప్రతిష్ఠించిన ఆధునిక రూపం; ఇది పురాణాల్లో ఉన్న దేవతా రూపం కాదు.
పురాణాలలో ‘భూతశుద్ధి’ — (పంచభూత శుద్ధీకరణ వివరణలు)
పలు పురాణాల్లో పంచభూతాల ఉత్పత్తి, వాటి శుద్ధి, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనం గురించి వివరించబడింది.
శివ పురాణం : శివ పురాణంలోని విధి పాదము మరియు రుద్ర సంహితలో పూజలో భూతశుద్ధి ఒక ముఖ్యమైన అంతర్గత క్రతువు అని చెప్పబడింది.
- దేవారాధనకు ముందు
- శరీరంలోని పంచభూతాల సమన్వయం
- ప్రాణాన్ని శుద్ధి చేయడం
- అంతర్గత “లింగాన్ని” పవిత్రం చేయడం
పూజా మొదటి దశలలో “భూతశుద్ధి” తప్పనిసరి అని స్పష్టం.
లింగ పురాణం : పూజ, ప్రాణ-ప్రతిష్ఠ ప్రారంభించే ముందు “భూతశుద్ధి”ని అత్యున్నత అంతర్యాగం (Internal purification)గా పేర్కొంటుంది.
దేవి భాగవత పురాణం : దేవి ఉపాసనలో భూతశుద్ధి ఒక తాంత్రిక ప్రక్రియగా ప్రస్తావన.
విశేషంగా శోధన, ప్రాణాయామం, ఆకాశ-అగ్ని శుద్ధి.
స్కాంద పురాణం : పంచభూతాలు: ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి
సాధకుడు ధ్యానం/పూజ ప్రారంభించే ముందు వీటి “మాలిన్యాన్ని తొలగించే” భూతశుద్ధిని చేయాలి అని తెలిపింది.
శైవ ఆగమాలలో ఉన్న ‘భూతశుద్ధి’
శైవ ఆగమాలు — కామిక, కరణ, అజిత, దీప్ట, రౌద్ర, చింత్యా — భూతశుద్ధిని దేవారాధన ప్రారంభించే మొదటి దశగా పేర్కొంటాయి.
ఆగమాల్లోని భూతశుద్ధి దశలు:
నాడీ శుద్ధి, ప్రమేయ-బంధ శుద్ధి, పంచభూత శుద్ధి, అంతర్గత లింగ శుద్ధి, ప్రాణ-అగ్ని దీపనం, శరీరం దేవాలయంగా భావించడం
ఇక్కడ భూతశుద్ధి అనేది: శరీరాన్ని దేవాలయంగా భావించే స్థితి; పంచభూతాలను శుద్ధి చేసి దేవతానుగ్రహానికి సిద్ధం కావడం. శైవ ఆగమాలు ఈ క్రతువును అత్యంత పవిత్రమైన యోగ-తాంత్రిక క్రియగా పేర్కొంటాయి. కాని… ఆగమాలు కూడా ఇది ‘వివాహం’లో ఉపయోగించాలి అని ఎక్కడా చెప్పలేదు.
తంత్ర శాస్త్రంలో ‘భూతశుద్ధి’
తంత్ర సాహిత్యం (శాక్తతంత్రాలు, భైరవీతంత్రం, రుద్రయామల, కలికా తంత్రం) భూతశుద్ధిని ఇలా నిర్వచిస్తుంది:
తాంత్రిక భూతశుద్ధి:
- శరీరంలో పంచభూతాలన్నింటినీ “ప్రకాశరూపం”గా భావించడం
- శరీరం = శివలింగం
- శుద్ధి → శక్తి ఆవాహనం → అంతర్యాగం
తంత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైన సూత్రం. ప్రత్యేకంగా “భైరవి ఉపాసన”లో భూతశుద్ధి ఉంది. అందుకే, భైరవీ ఉపాసనా పద్ధతుల్లోని భూతశుద్ధి అనే ప్రక్రియను కేంద్రంగా చేసుకుని, లింగ భైరవీ దేవి అనే దైవ రూపాన్ని, భూతశుద్ధి వివాహమనే పెళ్లి విధానాన్ని సద్గురు వాసుదేవ్ స్వయంగా సృష్టించారు. కాని…తంత్రాల్లో కూడా ‘భూతశుద్ధి వివాహం’ అనే భావన లేదు.
యోగ శాస్త్రం & ఉపనిషత్తుల్లో ‘భూతశుద్ధి’
హఠయోగ ప్రదీపిక: భూతశుద్ధి అంటే, శరీరం, నాడులు, పంచభూత శాంతి, మనస్సు స్థిరత్వం – సాధనకు ముందు నిర్బంధంగా చేయాల్సిన అంతర్గత సంసిద్ధత అని పేర్కొంటుంది.
గోరక్ష శతకం : యోగి భూతశుద్ధిని శరీర-ప్రాణ శుద్ధికి ముఖ్యమైన దశగా చెప్పాడు.
ఉపనిషత్తులు: తైత్తిరీయ ఉపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు పంచకోశ, పంచభూత సిద్ధాంతాన్ని చెప్తాయి.
భూతశుద్ధి → ప్రాణవాయువుల శుద్ధి → చిత్తశుద్ధి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram