Rashmi Gautam | స్కిన్‌షో సనాతన ధర్మమేనా..? యాంకర్ రష్మికి నెటిజన్ ప్రశ్న..! ఘాటుగా స్పందించిన జబర్దస్త్ బ్యూటీ..!
Rashmi Gautam | రష్మి గౌతమ్ పరిచయం అక్కర్లేని పేరు. ఓ వైపు యాంకర్ బుల్లితెరపై రాణిస్తూ.. సినిమాలను సైతం చేస్తున్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ.. ఆయా విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తుంటుంది. ఎక్కువ మూగజీవాలపై పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇటీవల తొలిసారిగా సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది. ఈక్రమంలో పలువురు యాంకరమ్మను ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రష్మిపై ‘స్కిన్ షో, ఎక్స్‌పోసింగ్ సైతం సనాతన […]

Rashmi Gautam |
రష్మి గౌతమ్ పరిచయం అక్కర్లేని పేరు. ఓ వైపు యాంకర్ బుల్లితెరపై రాణిస్తూ.. సినిమాలను సైతం చేస్తున్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ.. ఆయా విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తుంటుంది. ఎక్కువ మూగజీవాలపై పోస్టులు పెడుతూ ఉంటుంది.
ఇటీవల తొలిసారిగా సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది. ఈక్రమంలో పలువురు యాంకరమ్మను ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రష్మిపై ‘స్కిన్ షో, ఎక్స్‌పోసింగ్ సైతం సనాతన ధర్మమేనా?’అంటూ ప్రశ్నించారు.
ప్రస్తుతం రష్మి ‘బాయ్స్ హాస్టల్’ చిత్రంలో నటిస్తున్నది. అయితే, ఈ చిత్రాన్ని ఉద్దేశించి నెటిజన్ సెటైర్ వేయగా.. రష్మి తనదైన శైలిలో స్పందించింది. ‘వాదనలు గెలవలేనప్పుడు ఇలాంటి ఫొటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు’ అంటూ ఘాటుగానే స్పందించింది.
‘ఇది సంస్కృతిలో ఓ భాగం. మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు ? దండయాత్రలు జరగడానికి ముందు మేం ఎలా దుస్తులు ధరించమో దయచేసి తెలుసుకోవాలి? హిందూ బాలికలు ఎలా ధరించారు ? ఏం ధరించారు ? అనేది తెలుసుకోవాలి.
మేం ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే. వాటికి హిందూమతం, సనాతన ధర్మంతో సంబంధం లేదు’ అంటూ బదులిచ్చింది. దీనికి స్పందించిన నెటిజన్ హీరోయిన్లు సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు స్కిన్‌షోను ఆపేయాలని సూచించాడు.
అయితే, చాలా మంది రష్మికి మద్దతుగా నిలిచారు. ఓ పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో వ్యాఖ్యలను ఖండించినందుకు మిమ్మల్ని ప్రశ్నస్తున్న వారితో చర్చల్లో పాల్గొనొద్దని సూచించారు. అలాగే, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. దానిపై ట్రోల్స్ చేశారు.
వాస్తవానికి తమిళనాడుకు చెందిన నటుడు, మంత్రి ఉదయనిధి స్టాల్ వ్యాఖ్యలో సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మ ఓ రోగంలాంటిదని, డెంగ్యూ, మలేరియా, కరోనాలు ఎంత ప్రమాదకరమో అంతే ప్రమాదకరమని.. వెంటనే దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలతో పాటు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.