Minister Jagadish Reddy | ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడేందుకు కేసీఆర్ కృషి: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Minister Jagadish Reddy కేసీఆర్ ఉన్నంత‌వ‌ర‌కూ సింగ‌రేణిలో ఇంకెవ‌రూ యాక్ష‌న్లో పాల్గొన‌లేరు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు త్వ‌ర‌లోనే ప‌రిహారం విధాత‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఆర్టీసీ, విద్యుత్, సింగ‌రేణి సంస్థ‌ల‌ను కాపాడుకునేందుకు ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు చాలా కృషి చేస్తున్నార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయ‌న శ‌నివారం రోజు ఈ విష‌యాల‌పై ప్ర‌సంగించారు. కేంద్ర ప్ర‌భుత్వం సింగ‌రేణిలో రెండు క్లాజుల‌ను ప‌ట్టించుకోకుండా, మూడో క్లాజును అడ్డుపెట్టుకుని ఓపెన్ యాక్ష‌న్‌కు పిలిచిందన్నారు. […]

Minister Jagadish Reddy | ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడేందుకు కేసీఆర్ కృషి: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Minister Jagadish Reddy

  • కేసీఆర్ ఉన్నంత‌వ‌ర‌కూ సింగ‌రేణిలో ఇంకెవ‌రూ యాక్ష‌న్లో పాల్గొన‌లేరు
  • ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు త్వ‌ర‌లోనే ప‌రిహారం

విధాత‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఆర్టీసీ, విద్యుత్, సింగ‌రేణి సంస్థ‌ల‌ను కాపాడుకునేందుకు ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు చాలా కృషి చేస్తున్నార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయ‌న శ‌నివారం రోజు ఈ విష‌యాల‌పై ప్ర‌సంగించారు. కేంద్ర ప్ర‌భుత్వం సింగ‌రేణిలో రెండు క్లాజుల‌ను ప‌ట్టించుకోకుండా, మూడో క్లాజును అడ్డుపెట్టుకుని ఓపెన్ యాక్ష‌న్‌కు పిలిచిందన్నారు. ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ గ‌తంలోనే ప్ర‌ధాని మోదీకి లేఖ రాసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు.

ద్వైపాక్షిక ఒప్పందం ప్ర‌కారం సింగ‌రేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి హ‌క్కు ఉంద‌ని, కార్మికుల‌కు దేశంలో
ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా లాభాల్లో వాటాలు, బోన‌స్‌లు ఇస్తున్న సింగ‌రేణిని బ‌తికించుకోవ‌డానికి జోక్యం చేసుకోవాల‌ని లేఖ‌లో రాశార‌న్నారు. కేంద్ర‌మంత్రి తీరిగ్గా 2023 జ‌న‌వ‌రిలో లేఖ రాశార‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం యాక్ష‌న్‌లో పాల్గొనాల‌ని రాసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌ను, కార్మికుల‌ను వ‌చ్చే 20 ఏళ్లు తామే అధికారంలో ఉంటాము.. కాపాడుకుంటాము అని జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు.

ఉద్యోగాల విష‌యంలో దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు అడిగిన ప్ర‌శ్న‌కూ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి స‌మాధాన‌మిచ్చారు. ఓపెన్ కాస్ట్ గ‌నుల్లో చ‌నిపోయిన కుటుంబాల‌కు సంబంధించిన వారి వార‌సుల‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నామ‌ని, త్వ‌ర‌లోనే ప‌రిహారం కూడా క‌లెక్ట‌ర్ల ద్వారా పంపిణీ చేస్తామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తాము అధికారంలోకి వ‌స్తామ‌ని క‌ల‌లు కంటున్నార‌ని, వారు పొర‌పాటున వ‌స్తే, సింగ‌రేణి తెలంగాణ చేతుల్లోనుంచి బ‌య‌ట‌వారి చేతుల్లోకి వెళుతుంద‌ని మంత్రి ఎద్దేవా చేశారు.