Minister Jagadish Reddy | కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadish Reddy | విధాత : తన పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావులను కూడా ఆయన కలిశారు. వారు మంత్రి జగదీశ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ఇండియా చాలెంజ్ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని […]

గ్రీన్ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్ రెడ్డితో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్,అనిల్ కుర్మాచలం,రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram