Green India Challenge| జీవితాంతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగిస్తా: మాజీ ఎంపీ సంతోష్
జీవితాంతం కొనసాగించాలన్న లక్ష్యంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించాని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి కీసర గుట్టపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ప్రారంభించారు

Green India Challenge
విధాత, హైదరాబాద్: జీవితాంతం కొనసాగించాలన్న లక్ష్యంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించాని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి కీసర గుట్టపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. కేసీఆర్ స్ఫూర్తితోనే ఈ యజ్ఞం మొదలు పెట్టానన్నారు. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరి మూడు మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరగా అది నేడు 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన బృహత్కర కార్యక్రమం అయిందన్నారు.
అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంతోష్ అంటేనే హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుందన్నారు. పచ్చని చెట్లు చూస్తే సంతోషంగా ఉంటుందనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 7 వసంతాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ వసంతంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమన్నారు.