Green India Challenge | ఏడో వసంతంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. తులసీ మొక్కల పంపిణీ
బీఆరెస్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సంందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కార్యకర్తలు జూబ్లీచెక్ పోస్ట్ లో తులసి మొక్కలు పంపిణి చేశారు. ఆ దారిన వెలుతున్న వారికి తులసీ మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. వాహనాదారులకు, ట్రాఫిక్ పోలీసులకు సైతం మొక్కలు పంపిణీ చేశారు.
మరోవైపు ఏడవ సంవత్సరం ఉత్సవాలను సంతోష్ కుమార్ ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమా పాథితో ప్రారంభింపచేసి మొక్కలు నాటారు. ఒడిశాలో 1కోటి మొక్కలను నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు. సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి బీఆరెస్ ప్రభుత్వ హయాంలో మంచి స్పందన లభించింది. సెలబ్రెటీలు పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించి మొక్కలు నాటడటం ద్వారా అప్పటి ప్రభుత్వం చేపట్టిన హరిత హారం లక్ష్యాలకు బాసటగా నిలిచారు