వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి.. ఎంతో కలచివేసిందన్న కేటీఆర్
Minister KTR | హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. బాలుడి మృతి తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కేటీఆర్. అభం శుభం తెలియని ఓ నాలుగేండ్ల చిన్నారిపై […]

Minister KTR | హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. బాలుడి మృతి తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కేటీఆర్.
అభం శుభం తెలియని ఓ నాలుగేండ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. జంతువులను వేటాడినట్టు కుక్కలన్నీ ఆ బాలుడిపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాబు ప్రాణాలను బలిగొన్నాయి.