Minister Niranjan Reddy | అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy | విధాత: అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, […]

Minister Niranjan Reddy | విధాత: అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ లు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వర్తింపజేశామని పేర్కొన్నారు. వృత్తుల వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, దశలవారీగా అందరికీ రూ.లక్ష సాయం అందజేస్తామని తెలిపారు. నేడు తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచడం వల్ల వనపర్తి నియోజకవర్గంలో 6551 మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. ఒక్క వనపర్తిలో వెయ్యికి పైగా బంగారు దుకాణాలు, 50 వరకు బిర్యానీ సెంటర్లు ఏర్పాటయ్యాయని, కార్ల షోరూంలు, బైక్ షోరూంలు, సూపర్ మార్కెట్ల రాకతో వేల మందికి కొత్తగా ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. ఒకనాడు పదెకరాల రైతు కూడా తిండికి తండ్లాడిన పరిస్థితి అని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి నుంచి గట్టెక్కడం తెలంగాణ సాధించిన విజయంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు