మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ కమిటీ నివేదిక మేరకే నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఇచ్చే నివేదిక మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు
- వీలైనంత త్వరగా నివేదిక కోరాం
- కమిటీతో భేటీయైన ఉత్తమ్
- కాళేశ్వరంలో బీఆరెస్ అవినీతికి మోదీ సహకారం
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఇచ్చే నివేదిక మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన ఎన్డీఎస్‌ఏ కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
కమిటీ సలహాలను పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు. బ్యారేజీ డ్యామేజ్ కి రీజన్స్ చెప్పాలని కోరారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ కమిటీ నాలుగు రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని, కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి కోరామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులతోపాటు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
మోదీ విదానాల వల్లే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం బీఆరెస్‌కు ఏటీఎంగా మారటానికి మోదీ విధానాలే కారణమని విమర్శించారు. కార్పొరేషన్ల ద్వారా బీఆరెస్ ప్రభుత్వానికి రూ.84వేల కోట్ల రుణం కేంద్రమే అందించిందనిని గుర్తు చేశారు. ఇక మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదని ఉత్తమ్ అన్నారు. ఎన్డీఎస్ఏ నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు. దాని ఆధారంగా వెంటనే బ్యారేజీ రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
రిపేర్లతో అందుబాటులోకి వస్తే మంచిదే
వర్షాలు రాకముందే కాళేశ్వరం బ్యారేజీల వద్ద ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని కమిటీ నిపుణులను అడిగామని, బ్యారేజీలు రిపెర్స్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, సాధ్యాసాధ్యాలు చెప్పండని కోరామని ఉత్తమ్ తెలిపారు. ఎన్డీఎస్‌ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని, ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కమిటీకి ఇవ్వాలని అధికారులను అదేశించామని, కమిటీకి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్డీఎస్‌ఏ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే వచ్చినట్లుగా వెల్లడించారు. రేపు గురువారం ఉదయం మేడిగడ్డ, అనంతరం అన్నారం, రాత్రి రామగుండం. 8న సుందిల్ల బ్యారేజీ విజిట్ ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీల పరీక్షల కోసం ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సుచించామని, రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదని అభిప్రాయపడ్డారు.
వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తె మరీ మంచిదని ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విజిట్ పూర్తి చేసుకుంటుందని, ఎన్డీఎస్‌ఏ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌ఆండ్‌టీ రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోందని, మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని, నిర్మాణ సంస్థ కు భాధ్యత ఉండాలని, జుడిష్యల్ ఎంక్వైరీ పై త్వరలోనే ముందడుగు ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram