• Telugu News
  • /Telangana

Uttam Kumar Reddy : హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి

నీటి పారుదల ప్రాజెక్టులపై హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Dec 22, 2025, 6:47 pm IST
Read Time: 4 mins
Uttam Kumar Reddy : హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి

విధాత, హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్న మాజీ మంత్రి టి. హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చురకలేశారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్ లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పాలకులు కాళేశ్వరం కట్టారని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని..రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 80 -90 టీఎంసీ మాత్రమే నీళ్లను ఉపయోగించారని, హరీష్ రావు అతి తెలివి తేటలు వాడుతూ అబద్దాలు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు ఆపేక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణ కు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, slbc లను ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు బరితేగించి మాట్లాడుతున్నారన్నారు.

కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20 వేల కోట్లు రూపాయలు కడుతున్నామని ఉత్తమ్ తెలిపారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డివెర్షన్ సేవింగ్ 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాశామమని..ఈ లేఖ కొత్తది కాదు అని, గత బీఆర్ఎస్ ఒప్పందాన్నే మేము లేఖగా రాశామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

2020 కే ఆర్ఎంబీ సమావేశంలో కేసీఆర్ 34 శాతం నీటికి ఒప్పుకుంటే మేము 71 శాతం కావాలని లేఖ రాశామని, పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదు అని ఉత్తమ్ తెలిపారు. పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని, ఆయన చెప్పినట్లుగా 90 శాతం పనులు పూర్తి అయితే… ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ నిలదీశారు.

ఇవి కూడా చదవండి :

National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు..సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు
95 Year Old Sarpanch : పంచాయతీ పాలకుడిగా మాజీ మంత్రి తండ్రి