Miryalaguda | కోమటిరెడ్డీ.. రాజీనామాకు నేను రెడీ… నువ్వు రెడీనా?: ఎమ్మెల్యే భాస్కరరావు ప్రతి సవాల్
Miryalaguda రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా లేదనడం కోమటిరెడ్డి సవాల్ పై ఆగ్రహించిన ఎమ్మెల్యే ఏ సబ్ స్టేషన్ లో నైనా నిరూపించాలంటూ సవాల్ పిచ్చి కూతలకు కేసీఆర్, కేటీఆర్ లు అవసరం లేదు నేను చాలు విధాత : రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరావిషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదలైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రగులుతూనే వుంది. తాజాగా గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ […]

Miryalaguda
- రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా లేదనడం కోమటిరెడ్డి సవాల్ పై ఆగ్రహించిన ఎమ్మెల్యే
- ఏ సబ్ స్టేషన్ లో నైనా నిరూపించాలంటూ సవాల్
- పిచ్చి కూతలకు కేసీఆర్, కేటీఆర్ లు అవసరం లేదు నేను చాలు
విధాత : రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరావిషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదలైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రగులుతూనే వుంది. తాజాగా గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు.
రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సబ్ స్టేషన్ లో రైతంగానికి 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవని, మంత్రి కేటీఆర్ వస్తే నిరూపించడానికి తాను సిద్ధమని సవాల్ విసిరిన నేపథ్యంలో.. దానికి ప్రతిగా ఎమ్మెల్యే భాస్కరరావు స్పందిస్తూ మాటకు కట్టుబడి కోమటిరెడ్డి నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని.. నిరూపించకపోతే రాజీనామాకు కోమటిరెడ్డి సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు.
గురువారం పట్టణంలోని విశ్వకర్మల కమ్యూనిటీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ స్పీకర్,ఎమ్మెల్సీ సరికొండ మధుసూదనాచారి తో కలిసి మాట్లాడుతూ కనీస అవగాహన లేని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 12 గంటలకు మించి ఏ సబ్ స్టేషన్ లో కరెంటు రావడం లేదంటూ మాట్లాడటం, మంత్రి కేటీఆర్ కు స వాలు విసరటం అవివేకమన్నారు.
వెంకట్ రెడ్డి స్థాయికి కేటీఆర్, కెసిఆర్ లు అవసరం లేదని, ఈ జిల్లాలోని ఎమ్మెల్యేగా తాను సిద్ధమన్నారు. నియోజకవర్గం లో ఏ సబ్ స్టేషన్ లోనైనా నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రతి సబ్ స్టేషన్ లో కరెంటు ఎన్ని గంటలు సరఫరా అయ్యే విషయం రికార్డెడ్ గా ఉంటుందని, అదీ చాలకపోతే హైదరాబాద్ లోని ట్రాన్స్ కో సీఎండి చాంబర్ లో పూర్తి సమాచారం ఉంటుంది చూసుకోవాలన్నారు.
అవగాహన లేని పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు.ఒకపక్క పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3గంటలు చాలంటారు మరోపక్క కాంగ్రెస్ నాయకులు ఇలా అసత్యాలు మాట్లాడుతారు రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ వారి కపట బుద్దిని గమనిస్తుందంన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం తమదే నన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు తదితరులున్నారు.