కాంగ్రెస్‌తో BRS కలవక తప్పదు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది హంగ్ అసెంబ్లీ అని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లకు మించి రావు అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదన్నారు. మంగళవారం నాడు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. జాతీయ రహదారులతో పాటు రీజినల్ రింగ్ రోడ్లకు […]
విధాత: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది హంగ్ అసెంబ్లీ అని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లకు మించి రావు అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదన్నారు.
మంగళవారం నాడు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. జాతీయ రహదారులతో పాటు రీజినల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్ల వస్తాయనన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తాను పార్టీని గెలిపిస్తా అంటే మిగిలిన వారు ఇంట్లోనే ఉంటారు. తాను స్టార్ క్యాంపెయినర్‌ను.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతాను? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మార్చి మొదటి వారం నుంచి యాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై పార్టీ అనుమతి తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram