Bhogi Festival | ఎల్లుండే భోగి పండుగ..! భోగి మంటలు ఏ సమయంలో వేయాలంటే..?
Bhogi Festival | మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇక భోగి అంటేనే గుర్తొచ్చేది భోగి మంటలు. ఆ రోజున అందరూ భోగి మంటలు వేసి.. దానిపై నీళ్లను కాగబెట్టి ఆ వేడి నీళ్లతో అభ్యంగస్నానం ఆచరిస్తారు. మరి ఈ ఏడాది భోగి పండుగ ఎప్పుడు..? ఏ సమయంలో భోగి మంటలు వేయాలి..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Bhogi Festival | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే పట్టణాల నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో పల్లెల్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగకు రెండు రోజులే మిగిలి ఉంది. 14న భోగి పండుగ, 15న సంక్రాంతి పండుగ చేసుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భోగి పండుగ యొక్క విశిష్టత తెలుసుకుందాం. అంటే భోగి మంటలు ఏ సమయంలో వేయాలి..? ఆ మంటల్లో ఏం వేయాలి..? అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం.
భోగి పండుగ ఎప్పుడంటే..?
ఈ నెల 15న మకర సంక్రాంతి పండుగ వస్తుంది. కాబట్టి ఆ ముందు రోజు భోగి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అంటే 14న భోగి పండుగ జరుపుకోవాలి. ఇక భోగి మంటల కోసం.. ఆవు పేడతో తయారు చేసిన పిడకలను సిద్ధం చేశారు. భోగి ముందు రోజు రాత్రి పల్లెల్లో కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా! భోగిమంటలు వేద్దామా అని ఎదురు చూస్తుంటారు.
మరి ఏ సమయంలో భోగి మంటలు వేయాలి..?
భోగి మంటలు బ్రాహ్మీ ముహూర్తంలోనే వేయాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అంటే బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్యలోనే భోగి మంటలు వేయాలి.
భోగి మంటల్లో ఏమి వేయాలి?
భోగి మంటల్లో ఎండిన పిచ్చి చెట్లు, తాటాకులు, పనికిరాని వస్తువులు, పాతబడిన వస్తువులు వేయాలి. వీటిలో పాటు పిడకల దండలు కూడా వేయాలి. మరి ముఖ్యంగా భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు.
భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..?
భోగి మంటల్లో ఆవు నెయ్యి, ఆవు పిడకలు, కొన్ని ఔషధ వృక్షాల కొమ్మలు వేయడం వల్ల శక్తివంతమైన వాయువులు విడుదలై గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే భోగి మంటలు తప్పకుండా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వంటివి వేయరాదు. ఇలాంటివి వేస్తే వాయు కాలుష్యం పెరుగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram