మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
ఈ సారి మేడారం జాతరను భక్తులను ఆకర్షించే విధంగా అన్ని హంగులూ, రంగులతో ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా తీర్చదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రధానమైన గద్దెల ప్రాంగణాన్ని ఉన్నతీకరిస్తున్నారు. దీనికి తోడు మేడారంలోని ప్రధాన సెంటర్లను అందమైన, ఆకర్షణీయమైన బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు
- మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
- అందరినీ ఆకట్టుకుంటున్న ఆకృతులూ
- ముఖ్యమైన సెంటర్లలో బొమ్మల ఏర్పాటు
- ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
విధాత,ప్రత్యేక ప్రతినిధి: ఈ సారి మేడారం జాతరను భక్తులను ఆకర్షించే విధంగా అన్ని హంగులూ, రంగులతో ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా తీర్చదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రధానమైన గద్దెల ప్రాంగణాన్ని ఉన్నతీకరిస్తున్నారు. దీనికి తోడు మేడారంలోని ప్రధాన సెంటర్లను అందమైన, ఆకర్షణీయమైన బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. జాతరలోని విశాలమైన ప్రాంతంలోని ప్రధాన గోడలకు ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడే విధంగా బొమ్మలు, చిత్రాలు చిత్రించారు. ముఖ్యంగా చిలుకల గుట్టకు వెళ్ళే దారిలోని గోడలను ఆదివాసీ కోయల చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే రంగురంగుల బొమ్మలు చిత్రించారు. సెంటర్లలోని ఆదివాసీ నృత్యాలు, డోలు, వ్యవసాయం, ఎడ్లబండ్లు, ధాన్యాన్ని దంచే దృశ్యాలు, రకరకాలైన పులి, సింహం, జింకలు, ఏనుగు,అడవిదున్నలు, నెమళ్ళు, కొంగలు తదితర జంతువుల బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి ప్రధాన సెంటర్లలో ఫౌంటెన్ల మధ్య ఏర్పాటు చేశారు. ఇందులో ఆదివాసీ మహిళలు సామూహిక నృత్య భంగిమలు, డోలు డ్యాన్సులు, కొమ్ము, బూర ఊదడం తదితర చిత్రాలున్నాయి. థింసా, గుస్సాడి చిత్రాలున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళల చిత్రాలు చిత్రీకరించారు. మేడారంలోనే కాకుండా ములుగు, జంగాలపల్లి, తాడ్వాయి, పస్రా తదితర ప్రాంతాల్లోని ప్రధాన సెంటర్లలో కూడా ఈ బొమ్మలు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు వీటిని చూసి సంతోషం వ్యక్తం చేస్తుండగా దాదాపు ప్రతీ ఒక్కరు ఏదో ఒక చోట ఈ బొమ్మలతో సెల్ఫీలు, కుటుంబాలతో కలిసి ఫోటు దిగుతున్నారు. మేడారం జాతరకు వచ్చినందుకు ఇదొక గుర్తుగా మారిపోయాయి.
ఇవి కూడా చదవండి :
Love Insurance : బాయ్‌ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
Gig Workers : భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
Army Chief Upendra Dwivedi : ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
Cow vs Leopard Fight : చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్ వీడియో

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram