AP: క్యాలెండర్‌లో తప్పులు.. జగన్‌కు చిక్కులు! ఏకి పారేస్తున్న TDP, జనసేన
విధాత: వెక్కిరించేవాళ్ళ ముందు కాలు జారి పడిపోవడం అంటే ఇదే.. జగన్ చేస్తున్న కార్యక్రమాలు.. అమలు చేస్తున్న పథకాల్లో ఎక్కడ తప్పులు దొరుకుతాయా.. వేలెత్తి చూపుదామా అని ఎదురుచూస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు తాజా కార్యక్రమం ఓ అవకాశంగా మారింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీవరకు చేపట్టే ఇంటింటి సర్వేలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇంటింటికి వెళ్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపట్టే కార్యక్రమాలు .. పథకాలు […]

విధాత: వెక్కిరించేవాళ్ళ ముందు కాలు జారి పడిపోవడం అంటే ఇదే.. జగన్ చేస్తున్న కార్యక్రమాలు.. అమలు చేస్తున్న పథకాల్లో ఎక్కడ తప్పులు దొరుకుతాయా.. వేలెత్తి చూపుదామా అని ఎదురుచూస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు తాజా కార్యక్రమం ఓ అవకాశంగా మారింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీవరకు చేపట్టే ఇంటింటి సర్వేలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇంటింటికి వెళ్తున్నారు.
ఇందులో భాగంగా జగన్ చేపట్టే కార్యక్రమాలు .. పథకాలు గురించి వివరిస్తున్నారు. దీనికోసం ఓ క్యాలెండర్ కూడా ఇంటింటికి అందజేస్తున్నారు. ఆ కేలెండర్లో దొర్లిన తప్పుల్ని ప్రత్యర్థులు పెద్దవి చేసి చూపిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. జగన్ పార్టీ రూపొందించిన ఈ క్యాలెండర్లో వచ్చే సంక్రాంతిని.. అక్టోబరు 2న అంటే గాంధీ జయంతి రోజున సంక్రాంతి అంటూ ప్రింట్ చేశారు.
అంతే కాకుండా శుక్రవారం వచ్చే గుడ్ ప్రైడేను.. గురువారం వచ్చినట్లుగా తప్పుగా ప్రింట్ చేశారు. సంక్రాంతి జనవరిలో కదా వస్తుంది.. అక్టోబరులో రాదు కదా ? అంటూ ప్రశ్నలు విసురుతున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి ఫోటోతో ప్రింట్ చేసిన కరపత్రాల్లో ఇంత భారీ తప్పు దొర్లటమా? అంటూ టిడిపి, జనసేన సోషల్ మీడియాలో ఏకి పీకేస్తున్నారు.
తమను విమర్శించేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో మన అడుగులు మరింత జాగ్రత్తగా వేయాలన్నది జగన్ తెలుసుకోవల్సిన అవసరాన్ని ఈ చిన్న నిర్లక్ష్యం మరోసారి అప్రమత్తం చేసింది.