MLA Ravi Shankar | కొండగట్టు ఆలయంలో గిరిప్రదక్షిణ.. పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్

MLA Ravi Shankar విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం గిరిప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే సుంకె. రవిశంకర్ సతీ,సమేతంగా హాజరయ్యారు. కొండగట్టు బస్టాండు నుండి దొంగల మర్రి, నాచుపల్లి ,రాంసాగర్, నూకపెల్లి ,మల్యాల గ్రామాల మీదుగా 25 కిలోమీటర్ల మేర అంజన్న భక్తులు గిరి ప్రదక్షణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి […]

MLA Ravi Shankar | కొండగట్టు ఆలయంలో గిరిప్రదక్షిణ.. పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్

MLA Ravi Shankar

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం గిరిప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే సుంకె. రవిశంకర్ సతీ,సమేతంగా హాజరయ్యారు. కొండగట్టు బస్టాండు నుండి దొంగల మర్రి, నాచుపల్లి ,రాంసాగర్, నూకపెల్లి ,మల్యాల గ్రామాల మీదుగా 25 కిలోమీటర్ల మేర అంజన్న భక్తులు గిరి ప్రదక్షణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరి ప్రదక్షణ సంకల్పం చాలా గొప్పదని ఈ గురు పౌర్ణమి రోజు చేపట్టడం గొప్ప విషయం అన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.

ఈ ఆలయానికి ఛత్తీస్గడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తున్నారని ఈ గిరి ప్రదక్షణతో ఆంజనేయస్వామి మహిమ లోకమంతా మార్మోగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ప్రశాంతి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, మండల బీఆర్ఎస్ నాయకులు, ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు.