Jagitial | దారుణం..ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురు కిడ్నాప్

తమ కూతురు ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి కుటుంబ సభ్యులపై యువతి బంధువులు దాడి చేశారు. అంతే కాకుండా నవవధువును బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Jagitial | దారుణం..ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురు కిడ్నాప్

విధాత, హైదరాబాద్ :

తమ కూతురు ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి కుటుంబ సభ్యులపై యువతి బంధువులు దాడి చేశారు. అంతే కాకుండా నవవధువును బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్ అనే యువకుడు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమను ఇరుకుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, అమ్మాయి తల్లిదండ్రులు మాధవి ప్రేమ వివాహానికి ఒప్పుకోలేరు.

దీంతో చేసేది ఏమీ లేక వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు యువకుడి ఇంటికి వచ్చి అమ్మాయిని తమకు అప్పగించాలని గొడవ చేశారు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, శాంతించని మాధవి తల్లిదండ్రులు ఎలాగైన తమ కూతురుని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో సోమవారం యువతి బంధువులు ముత్తుకుమార్ ఇంటిపై దాడి చేసి మాధవిని బలవంతగా లాక్కెల్లారు. ఈ గొడవలో యువకుడి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాధవి ప్రాణాలకు హాని ఉందని, ఆమెను తమకు అప్పగించాలని యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.