Aghori at Kondagattu | కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మహిళా అఘోరీ..

Aghori at Kondagattu | ఐదు రోజుల క్రితం కొముర‌వెల్లి( Komuravelli ) మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న ఓ మ‌హిళా అఘోరీ( Aghori ).. తాజాగా కొండ‌గ‌ట్టు( Kondagattu ) అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఆ మ‌హిళా అఘోరీ( Woman Aghori )ని భ‌క్తులు చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

Aghori at Kondagattu | కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మహిళా అఘోరీ..

Aghori at Kondagattu | జ‌గిత్యాల : అఘోరా( Aghora ) అంటే సాధు జీవనంలోనే ఉన్నతమైన స్థితిగా వారు అభివర్ణిస్తూ ఉంటారు. వీరి పట్ల హిందూ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉంటాయి. కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. సంస్కృతంలో అఘోరీ( Aghori ) అంటే ‘భయం కలిగించని’ అని అర్థం కానీ. కానీ అఘోరాల వేషధారణ, ప్రవర్తన భీతిగొల్పుతూ ఉంటుంది. హిందూ సమాజంలో వీరిని దేవ ధూతలుగా భావిస్తారు. అఘోరాల్లో పురుషులే ఉంటారు. మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే మహిళ‌లను అఘోరీలుగా సంబోధిస్తారు.

అయితే తాజాగా ఓ మ‌హిళా అఘోరీ.. జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టు( Kondagattu) అంజన్న ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఆ మ‌హిళా అఘోరీకి అల‌య అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేయించారు. కొండ‌గ‌ట్టుకు చేరుకున్న మ‌హిళా అఘోరీని భ‌క్తులు చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆమెను ద‌ర్శించుకున్నారు. ఐదు రోజుల క్రితం ఈ మ‌హిళా అఘోరీ.. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి( Komuravelli ) మల్లన్న ఆలయంలో ప్ర‌త్య‌క్ష‌మై, ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి హిమాలయ మంచు గుహలు, కాశీ క్షేత్రం, బెంగాల్, గుజరాత్ అడవుల్లో అఘోరాలు ఎక్కువగా సంచరిస్తూ త‌పస్సులు చేస్తుంటారు.

ఇక అఘోరాలు మనుషుల పుర్రెలను పట్టుకుని సంచరిస్తూ ఉంటారు. దాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు. శరీరమంతా బూడిద ఉంటుంది. ఒంటిపై వస్త్రాలు ఉండవు. మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు. శివుడ్ని అమితంగా ఆరాధిస్తారు. గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు. శవాలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారు. వీరికి మంచీ చెడులు ఒక్కటే. బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడో లేదా దేవాలయాల్లో ఏవైనా ప్రత్యేక పూజలు సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకు తరలివస్తూ ఉంటారు.