యువతను ముంచిన కేసీఆర్: ఎమ్మెల్యే సీతక్క

- లీకేజీలతోనే పోటీ పరీక్షలు
- ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్న సర్కార్
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. ఈ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క తీవ్రంగా విమర్శించారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్నపత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ, యువతను పక్క దారి పట్టిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆదివారం రామ్ నాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. కరోనా, వరదలు, వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజూ ప్రజల్లోకి రాని నేతలంతా, ఈ రోజు వచ్చి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని అన్నారు. ములుగు నియోజకవర్గం నా ఇల్లు, ములుగు ప్రజలు నా కుటుంబం అని ఆమె అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకొని.. రాష్ట్రంతో పేరు బంధంతో పాటు పేగు బంధాన్ని కూడా కేసీఆర్ తెంచుకున్నారు.. ఓట్లప్పుడు పంచుదాం.. అధికారంలోకి రాగానే దోచుదాం అనేది ఇతర పార్టీల సిద్ధాంతం అని సీతక్క అన్నారు.
బీఆర్ఎస్ నుంచి చేరికలు
బీఆర్ఎస్ మద్దతు సర్పంచుగా ఓడిపోయిన పోరిక అమృనాయక్, బీఆర్ఎస్ ఉపసర్పంచ్ ధరావత్ తారకమ్మ , వార్డ్ సభ్యులు ధరమ్ సోత్ బుచ్చమ్మ, ధరం సోత్ శారద, శోబాన్, దరంసోతు అమృత, ముఖ్య కార్యకర్తలు పోరిక రతన్ సింగ్, బానోతు రాజు, ధరం శోత్ జై, ధారావత్ హీరా నాయక్, పొరిక రాజేందర్, మాజీ ఉపసర్పంచ్ పోరిక రాజు, పోరిక అర్జున నాయక్, పోరిక శ్రీను తదితరులు ఎమ్మెల్మే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రవి చందర్, ములుగు జిల్లా అధికార ప్రతినిధి కోడూరు రమేష్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుక్రు, వెంకటాపూర్ మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు.