జాగృతి కమిటీల రద్ధు.. ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. భారత జాగృతి విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు రద్దు చేసినట్లు జాగృతి కార్యాలయం ప్రకటించింది. కమిటీల రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటనలో వెల్లడించారు. అకస్మాత్తుగా కవిత జాగృతి కమిటీలను రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్‌కు అనుబంధంగా ఉండే జాగృతి కమిటీలను పార్లమెంటు ఎన్నికల సమయంలో రద్దు చేయడానికి కారణలేమై ఉండవచ్చన్న చర్చలు సాగుతున్నాయి. జాగృతి కమిటీలకు చెందిన పలువురు పార్టీ మారే అవకాశముందన్న సమాచారంతోనే ముందస్తు జాగ్రత్తగా కవిత కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం వినిపిస్తున్నది.