MLC KAVITHA | ఫోన్ల ముచ్చట వట్టిదేనా.. సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌

కవిత చూపిన ఫోన్లు ఫెక్ అంటూ ట్రోలింగ్‌ విధాత: VV వినాయక్ సినిమాల్లో ఫ్యాక్షనిష్టులు కత్తులు తిప్పుతూ తెల్ల పంచెలు వేసుకుని సుమోల్లో ఊరేగుతూ వెళ్లడం చూశాం.. ఇప్పుడు మళ్లీ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. తాను గతంలో వాడిన దాదాపు పది ఫోన్ల నుంచి ఈ లిక్కర్ స్కామ్ నడిపించారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పది ఫోన్లూ ఓ కవర్లో వేసుకుని వాటిని గాల్లో ఇలా ఇలా ఊపుతూ బయల్దేరిన కవిత తన నిజాయితీకి కొత్త భాష్యం […]

  • By: krs |    latest |    Published on : Mar 21, 2023 2:19 PM IST
MLC KAVITHA | ఫోన్ల ముచ్చట వట్టిదేనా.. సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌

కవిత చూపిన ఫోన్లు ఫెక్ అంటూ ట్రోలింగ్‌

విధాత: VV వినాయక్ సినిమాల్లో ఫ్యాక్షనిష్టులు కత్తులు తిప్పుతూ తెల్ల పంచెలు వేసుకుని సుమోల్లో ఊరేగుతూ వెళ్లడం చూశాం.. ఇప్పుడు మళ్లీ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. తాను గతంలో వాడిన దాదాపు పది ఫోన్ల నుంచి ఈ లిక్కర్ స్కామ్ నడిపించారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పది ఫోన్లూ ఓ కవర్లో వేసుకుని వాటిని గాల్లో ఇలా ఇలా ఊపుతూ బయల్దేరిన కవిత తన నిజాయితీకి కొత్త భాష్యం చెప్పారు.

మంగళవారం కవిత. ఢిల్లీలోని కేసీయార్ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో ఈడీ ఆఫీసుకు బయలు దేరారు. ఈ లోపు కవిత రెండుచేతుల్లోను రెండు కవర్లను పట్టుకుని చూపించారు. రెండు చేతుల్లోని కవర్లలో మొబైల్ ఫోన్లున్నాయి. ఆ ఫోన్లు ఎన్ని అనే విషయంపై స్పష్టత లేకపోయినా తొమ్మిది ఫోన్లున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈరోజే కవిత ఎందుకు మొబైల్ ఫోన్లను చూపించారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సూత్రదారిగా ఈడీ అనుమానిస్తున్న విషయం తెలిసిందే. కవితకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈడీ అనేక విషయాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వివరించింది.

అందులో కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణ కూడా ఒకటి. స్కామ్‌లో పాత్రదారులు 36 మంది మొత్తం 170 మొబైల్ ఫోన్లను వాడారని తర్వాత ధ్వంసంచేశారనేది ఆరోపణ. వాస్తవానికి ఆమె ఆ ఫోన్లను గతంలో ధ్వంసం చేసారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను వాటిని డ్యామేజ్ చేయలేదని చెప్పడానికి ఆమె ఇలా ఫోన్లు చూపించారా అన్న చర్చ మొదలైంది..

అయితే ఆ ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లను బట్టి చూస్తే అవి మొన్నటి 2022 అక్టోబర్లో తయారైనట్లుగా చెబుతున్నారు. కానీ ఈ స్కామ్ 2022 జులైలో జరిగిందని అంటున్నారు. అంటే ఆమె వేర్వేరు ఫోన్లను చూపించి ఈడీని బురిడీ కొట్టించాలని చూస్తున్నారా అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంత బిజీగా ఉండేవారైనా రెండు ఫోన్లు మహాయితే మూడు ఫోన్లు వాడచ్చు. కొంతమంది తరచూ ఫోన్లను మారుస్తుంటారు. అంతేకానీ ఏడాదిన్నర కాలంలో పది ఫోన్లను అయితే వాడరు. కానీ కవిత వాడారని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఇపుడు కవిత చూపించిన మొబైల్ ఫోన్లు కీలక ఆధారంగా మారింది.

చివరకు ఈ ఫోన్లు ఆమెను మరింత చిక్కుల్లో పడేస్తాయా చూడాలి.. ఈలోపు మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కవితమ్మ రాజసం మీద తెలంగాణ సమాజం.. యువత గట్టిగానే పోష్టులు పెడుతున్నారు.