POCO X6 Neo | పోకో ఎక్స్ సిరీస్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్.. ఈ సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో..
POCO X6 Neo : పోకో సంస్థ ఎక్స్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎక్స్ సిరీస్‌లో ఇప్పటికే POCO X6, POCO X6 Pro అందుబాటులో ఉన్నాయి. తాజాగా POCO X6 Neo పేరిట మరో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎక్స్6 నియో మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది.
ఇవాళ (మార్చి 13) సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త మోడల్ మొబైల్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే దీనిలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120 రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. మీడియా టెక్ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్‌ను అమర్చారు. 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. అదేవిధంగా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఇది పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. కాగా, ఇదే ధరల్లో రెడ్‌మీ నోట్ 13, దేశీయ బ్రాండ్ లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్‌లు లభిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram