Para Athletics: పారా అథ్లెట్‌లో మోహన హర్ష స్ఫూర్తిదాయకం: విక్ర‌మ్ కులాష్‌

నేరేడ్‌మెట్‌: పారా అథ్లెటిక్స్(Para Athletics) చాంపియన్షిప్‌(Championship)లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉయ్యాల మోహన హర్ష(Uyyala Mohana Harsha) రజత పథకంతో మెరిశాడు. దుబాయ్(Dubai) వేదికగా జరిగిన ప్రపంచ పురుషుల టి 47 విభాగంలో బరిలోకి దిగిన మోహన హర్ష 11.26 సెకన్ల టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా గాత్ర ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ కులాష్ సోమవారం తన కార్యాలయంలో భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి […]

Para Athletics: పారా అథ్లెట్‌లో మోహన హర్ష స్ఫూర్తిదాయకం: విక్ర‌మ్ కులాష్‌

నేరేడ్‌మెట్‌: పారా అథ్లెటిక్స్(Para Athletics) చాంపియన్షిప్‌(Championship)లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉయ్యాల మోహన హర్ష(Uyyala Mohana Harsha) రజత పథకంతో మెరిశాడు. దుబాయ్(Dubai) వేదికగా జరిగిన ప్రపంచ పురుషుల టి 47 విభాగంలో బరిలోకి దిగిన మోహన హర్ష 11.26 సెకన్ల టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచాడు.

ఈ సందర్భంగా గాత్ర ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ కులాష్ సోమవారం తన కార్యాలయంలో భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్‌తో కలిసి అభినందించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ కులాష్ మాట్లాడుతూ పారా అథ్లెట్లో రజత పథకంతో మెరిసిన మోహన హర్ష పారా అథ్లెట్ క్రీడా కారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.