Monkey | కోతులు పండ్లను దొంగిలించి తినడం చూశాం. ఇండ్లలోకి చొరబడి.. ఆహార పదార్థాలను అందినకాడికి తీసుకెళ్లి తినేయడం చూశాం. కానీ కొత్తగా ఓ కోతి బీర్లకు అలవాటు పడ్డది. మరి వైన్ షాపుల్లో బీర్లను దొంగిలించి తాగేస్తోంది. ఈ దొంగ కోతి వ్యవహారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో వెలుగు చూసింది. ఒకే ఒక్కడు.. జనరంజకుడు… KA పాల్ రాయ్ బరేలి జిల్లాలోని అచల్ గంజ్ ఏరియాలో ఓ వైన్ షాపు ఉంది. ఆ […]
Monkey | కోతులు పండ్లను దొంగిలించి తినడం చూశాం. ఇండ్లలోకి చొరబడి.. ఆహార పదార్థాలను అందినకాడికి తీసుకెళ్లి తినేయడం చూశాం. కానీ కొత్తగా ఓ కోతి బీర్లకు అలవాటు పడ్డది. మరి వైన్ షాపుల్లో బీర్లను దొంగిలించి తాగేస్తోంది. ఈ దొంగ కోతి వ్యవహారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో వెలుగు చూసింది.
రాయ్ బరేలి జిల్లాలోని అచల్ గంజ్ ఏరియాలో ఓ వైన్ షాపు ఉంది. ఆ మద్యం దుకాణంపై కోతి కన్నేసింది. అందరి కళ్లు గప్పి కోతి వైన్ షాపులోకి దూరిపోతోంది. మెల్లగా ఓ బీర్ బాటిల్ ను బయటకు తీసుకొచ్చి తాగేస్తోంది. అంతేకాదు.. అక్కడ మద్యం తాగాలంటే మందు బాబులు వణికిపోతున్నారు. వారి వద్ద ఉన్న బీర్ బాటిళ్లను కూడా ఆ కోతి ఎత్తుకెళ్లి తాగేస్తోంది. దీంతో అటు షాపు యజమాని, ఇటు మందు బాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. 65 ఏండ్లలో ఒకేసారి స్నానం
కోతి ఆగడాలను భరించలేక షాపు యజమాని ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొత్తంగా మద్యానికి బానిసగా మారిన కోతిని పట్టుకుని అడవిలో వదిలేశారు. మరి మందుకు మరిగిన కోతి మళ్లీ తిరిగి వస్తదో.. రాదో.. వేచి చూడాల్సిందే.