Monkey | సగం తిన్న అరటి పండు ఇస్తే బ్రహ్మానందం లెవల్లో ఆ కోతి ఇచ్చిన లుక్‌..

విధాత‌: కోతులకు (Monkey) పండ్లు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ అరటిపండ్లు అంటే మరీనూ! ఎన్ని ఇచ్చినా లాగించేస్తుంటాయి. ఇలా ఇవ్వగానే అలా లాక్కుని పారిపోతాయి. అలాగని సగం తిన్న అరటిపండు ఇస్తే ఊరుకోవు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి ఆ విషయం గట్టిగానే అర్థమై ఉంటుంది. ఆ కోతి ఇచ్చిన లుక్‌ చేస్తే.. మనలో ఎవరం కూడా సగం తిన్న అరటి పండ్లను కోతులకు ఇవ్వవేమో! ఒక వ్యక్తి ఒక కోతికి తాను సగం తిన్న […]

Monkey | సగం తిన్న అరటి పండు ఇస్తే బ్రహ్మానందం లెవల్లో ఆ కోతి ఇచ్చిన లుక్‌..

విధాత‌: కోతులకు (Monkey) పండ్లు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ అరటిపండ్లు అంటే మరీనూ! ఎన్ని ఇచ్చినా లాగించేస్తుంటాయి. ఇలా ఇవ్వగానే అలా లాక్కుని పారిపోతాయి. అలాగని సగం తిన్న అరటిపండు ఇస్తే ఊరుకోవు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి ఆ విషయం గట్టిగానే అర్థమై ఉంటుంది. ఆ కోతి ఇచ్చిన లుక్‌ చేస్తే.. మనలో ఎవరం కూడా సగం తిన్న అరటి పండ్లను కోతులకు ఇవ్వవేమో! ఒక వ్యక్తి ఒక కోతికి తాను సగం తిన్న అరటిపండును ఇచ్చాడు.

దానికి ఆ కోతి.. బ్రహ్మానందం లెవల్లో కళ్లు తిప్పుకొంటూ.. ఏందిరా ఇది? అన్నట్టు ఒక లుక్‌ ఇచ్చింది. కాసేపటికి మరోసారి అదే చూపు విసిరింది. అరటిపండును, ఆ వ్యక్తిని మార్చిమార్చి చూస్తుంటే.. ఆ లుక్‌ను చూసి.. నెటిజన్లు విభ్రాంతికి గురయ్యారు. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దీనికి స్పందించిన ఒక యూజర్‌.. ‘బ్రో.. కమాన్‌.. సగం తిన్న అరటి పండు ఇస్తావా?.. నీకు నవ్వులాటలా ఉన్నదా? అని కోతి ప్రశ్నిస్తున్నది’ అని రాశాడు.