Monsoon | ఆ వార్త‌ల్లో నిజం లేదు.. జూన్ 20 నాటికి తెలంగాణ‌కు రుతుప‌వ‌నాలు

Monsoon | జూలై 6 వ‌ర‌కు రుతుప‌వ‌నాలు రావ‌న్న వార్త‌ల్లో నిజం లేదు జూన్ 20 నుంచి జూలై 10 మ‌ధ్య తెలంగాణ‌లో మంచి వ‌ర్షాలు హైద‌రాబాద్‌, జూన్ 15 (విధాత ప్ర‌తినిధి): భానుడి భ‌గ‌భ‌గ‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను చ‌ల్ల‌బ‌రిచే వ‌ర్ష‌పు జ‌ల్లుల‌ను తెచ్చే రుతుప‌వ‌నాలు ఈసారి ఎప్పుడూ లేనంత ఆల‌స్యంగా తెలంగాణ‌ను తాకుతున్నాయి. జూన్ 20 నాటికి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌ను తాకుతాయ‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. జూలై 6 వ‌ర‌కు తెలంగాణ‌లో […]

  • By: krs    latest    Jun 15, 2023 8:56 AM IST
Monsoon | ఆ వార్త‌ల్లో నిజం లేదు.. జూన్ 20 నాటికి తెలంగాణ‌కు రుతుప‌వ‌నాలు

Monsoon |

  • జూలై 6 వ‌ర‌కు రుతుప‌వ‌నాలు రావ‌న్న వార్త‌ల్లో నిజం లేదు
  • జూన్ 20 నుంచి జూలై 10 మ‌ధ్య తెలంగాణ‌లో మంచి వ‌ర్షాలు

హైద‌రాబాద్‌, జూన్ 15 (విధాత ప్ర‌తినిధి): భానుడి భ‌గ‌భ‌గ‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను చ‌ల్ల‌బ‌రిచే వ‌ర్ష‌పు జ‌ల్లుల‌ను తెచ్చే రుతుప‌వ‌నాలు ఈసారి ఎప్పుడూ లేనంత ఆల‌స్యంగా తెలంగాణ‌ను తాకుతున్నాయి. జూన్ 20 నాటికి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌ను తాకుతాయ‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

జూలై 6 వ‌ర‌కు తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌వ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపారు. గ‌త ఏడాదిలాగా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు స్థాయిలో కాక‌పోయినా ఈ ఏడాది కూడా తెలంగాణ‌లో మంచి వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. జూన్ 20 నుంచి జూలై 6 మ‌ధ్య తెలంగాణ‌వ్యాప్తంగా మంచి వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంద‌ని కూడా తెలంగాణ వెద‌ర్ మ్యాన్ చెప్పారు.

బిప‌ర్‌జాయ్ తుఫాను పోయిన వెంట‌నే తెలంగాణ‌లోకి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయ‌ని, దీంట్లో ఎలాంటి సందేహం లేద‌న్నారు. రుతుప‌వ‌నాల ఆల‌స్యం కార‌ణంగా తెలంగాణ‌లో చాలాచోట్ల రైతులు పొలాలు దుక్కిచేసుకుని ఆకాశం వైపు చూస్తున్నారు.