Srikanth | ఎర్రవరంను సందర్శించిన సినీ నటుడు శ్రీకాంత్ దంపతులు

Srikanth | బాల ఉగ్ర నరసింహుడికి పూజలు విధాత: ఇటీవల భక్తజనాన్ని ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహా ఆలయాన్ని సినీ హీరో శ్రీకాంత్‌-ఊహా దంపతులు గురువారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. సినీ హీరో రాకతో వారిని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నటుడు శ్రీకాంత్ వంటి వారు సైతం ఆలయ సందర్శనకు రావడంతో ఆలయం […]

  • By: Somu |    latest |    Published on : Aug 17, 2023 12:33 PM IST
Srikanth | ఎర్రవరంను సందర్శించిన సినీ నటుడు శ్రీకాంత్ దంపతులు

Srikanth |

  • బాల ఉగ్ర నరసింహుడికి పూజలు

విధాత: ఇటీవల భక్తజనాన్ని ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహా ఆలయాన్ని సినీ హీరో శ్రీకాంత్‌-ఊహా దంపతులు గురువారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి వచ్చిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. సినీ హీరో రాకతో వారిని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.

నటుడు శ్రీకాంత్ వంటి వారు సైతం ఆలయ సందర్శనకు రావడంతో ఆలయం పేరు ప్రఖ్యాతులు మరింత విస్తరిస్తాయని ఆలయ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.