ప్రశాంత్ వర్మతో సినిమా.. లైన్‌లో రవితేజ, బాలకృష్ణ!
విధాత: గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం విడుదలైంది. డివైడ్ టాక్ వచ్చింది. ఇది కేవలం మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని తీసిన చిత్రంగా పలువులు తేల్చి పారేశారు. కానీ వారి మాటలను తప్పని నిరూపిస్తూ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గాని నిలిచింది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలైన […]

విధాత: గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం విడుదలైంది. డివైడ్ టాక్ వచ్చింది. ఇది కేవలం మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని తీసిన చిత్రంగా పలువులు తేల్చి పారేశారు. కానీ వారి మాటలను తప్పని నిరూపిస్తూ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గాని నిలిచింది.
ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలైన 20 రోజుల్లోనే ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీసు వద్ద ఓ ఊపు ఊపేస్తోంది. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రంలో రవితేజ పోషించిన విక్రం పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర కావడం విశేషం. ఈ పాత్ర రవితేజకు కలకాలం గుర్తుండి పోతుంది. ఇందులో ఈయన చూపిన నటన అద్భుతం అనిపించేలా సాగింది.
ఒకానొక దశలో చిరంజీవిని సైతం రవితేజ యాక్టింగ్ డామినేట్ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇలా వరుసగా రెండు వరుస చిత్రాలతో 100 కోట్ల క్లబ్బులలో చేరిన రవితేజ లిస్టులో ప్రస్తుతం చాలా చిత్రాలే ఉన్నాయి. సుదీర్ వర్మతో చేస్తున్న రావణాసుర పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.
ఇలాంటి సమయంలోనే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడని సమాచారం. అ, కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం, హనుమాన్, అదిరా వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ క్వీన్‌కి రీమేక్‌గా తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న దటీజ్ మహాలక్ష్మి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ విమర్శకుల ప్రశంసలను పొందగా, జాంబీరెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయగా, తేజ సజ్జా హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్ విడుదల కావాల్సి ఉంది. ఆ మధ్య విడుదల చేసిన హనుమాన్ ట్రైలర్ యావత్ దేశాన్ని వీపరీతంగా ఆకట్టుకోగా దీంతో పాటు విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్‌ను హనుమాన్ సినిమాతో పోలుస్తూ నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇప్పటివరకు ప్రశాంత్‌వర్మ తీసిన సినిమాలన్నీ విజయవంతం సాధిండంతో మినిమం గ్యారంటీ దర్వకుడిగా పేరు సంపాదించాడు. ఈ క్రమంలో రవితేజ ప్రశాంత్తో చిత్రంపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. అదేవిధంగా బాలకృష్ణ కూడా ప్రశాంత వర్మతో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.