చీర ధరించి ఫుట్ బాల్ ఆడిన ఎంపీ.. ఫోటోలు వైరల్
విధాత : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా చీర ధరించి, ఫుట్ బాల్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫుట్ బాల్ ఆడిన దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణన్‌నగర్ నియోజకవర్గం నుంచి మహువా మైత్రా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కృష్ణన్‌నగర్ ఎంపీ కప్ టోర్నమెంట్ ఫైనల్‌లో మహువా పాల్గొన్నారు. ఆరెంజ్ కలర్ శారీ ధరించిన ఆమె.. ఫుట్ బాల్ ఆడారు. ఒక ఫోటో బాల్‌ను కాలితో […]

విధాత : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా చీర ధరించి, ఫుట్ బాల్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫుట్ బాల్ ఆడిన దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణన్‌నగర్ నియోజకవర్గం నుంచి మహువా మైత్రా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే కృష్ణన్‌నగర్ ఎంపీ కప్ టోర్నమెంట్ ఫైనల్‌లో మహువా పాల్గొన్నారు. ఆరెంజ్ కలర్ శారీ ధరించిన ఆమె.. ఫుట్ బాల్ ఆడారు. ఒక ఫోటో బాల్‌ను కాలితో తన్నుతుండగా తీయగా, మరో ఫోటో ఆమె గోల్ కీపర్‌గా ఉన్న సమయంతో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రెండు ఫోటోలను మహువా మైత్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. కృష్ణన్ నగర్ ఎంపీ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కొన్ని సరదా సన్నివేశాలు అని రాసుకొచ్చారు. అవును, నేను శారీలో ఆడుతాను అని మహువా పేర్కొన్నారు.
ఇక మహువాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మహువా చీర ధరించి, ఫుట్ బాల్ ఆడటం గొప్ప విషయమని పలువురు కొనియాడుతున్నారు. ఆమె అద్భుతమని, రాక్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు. ఇక షర్మిష్ట ముఖర్జీ కూడా ఆమెను ప్రశంసించారు. కూల్, లవ్ ది షాట్ అని ముఖర్జీ రీట్వీట్ చేశారు.