Mulugu | మేడారంలో మహిళపై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి..
Mulugu విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగర శివారు పైడిపల్లికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ములుగుజిల్లా మేడారంలో జరిగింది. ఇటీవలనే హసన్‌పర్తి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మహిళ పై ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు కలిసి అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. వరుస అత్యాచార సంఘటనలతో ఆందోళన వ్యక్తమవుతుంది. పైడిపల్లి మహిళల పై అత్యాచారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు ఇంట్లో […]
Mulugu
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగర శివారు పైడిపల్లికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ములుగుజిల్లా మేడారంలో జరిగింది. ఇటీవలనే హసన్‌పర్తి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మహిళ పై ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు కలిసి అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. వరుస అత్యాచార సంఘటనలతో ఆందోళన వ్యక్తమవుతుంది.
పైడిపల్లి మహిళల పై అత్యాచారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు ఇంట్లో చెప్పకుండా ఏప్రిల్ 28న ములుగు జిల్లాలోని మేడారం జాతరకు స్నేహతురాలితో కలిసి వెళ్లింది. అక్కడనే ఆమెను ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.
ఏప్రిల్ 29న వివాహిత కనబడటం లేదని, వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 30వ తేదీన పైడిపెల్లికి వివాహిత తిరిగి వచ్చింది. పోలీసుల విచారణలో ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారని మహిళ తెలిపినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్ధన్నపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు సమాచారం. సోమవారం పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram