Bigg Boss 9 | 13వ వారం ఊహించ‌ని ఎలిమినేషన్… ఆ కంటెస్టెంట్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై సస్పెన్స్ పెరిగినట్టే!

Bigg Boss 9 |బిగ్ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 13వ వారం హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మారడంతో ఇంట్లో గేమ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

  • By: sn |    movies |    Published on : Dec 06, 2025 4:21 PM IST
Bigg Boss 9 | 13వ వారం ఊహించ‌ని ఎలిమినేషన్… ఆ కంటెస్టెంట్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై సస్పెన్స్ పెరిగినట్టే!

Bigg Boss 9 |బిగ్ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 13వ వారం హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మారడంతో ఇంట్లో గేమ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ వారం నామినేషన్‌లలో తనూజ, రీతూ చౌదరీ, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ప్రకారం తనూజ, రీతూ, పవన్ సేఫ్ జోన్‌లో ఉన్నప్పటికీ… అధికారిక ఓటింగ్ ట్రెండ్స్ మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.

సుమన్ శెట్టి లీస్ట్‌లో?

బిగ్ బాస్ ఫాలోవర్స్ షేర్ చేస్తున్న తాజా అప్‌డేట్స్ ప్రకారం సుమన్ శెట్టి ఈ వారం లీస్ట్ ఓటింగ్‌లో ఉండటంతో ఎలిమినేషన్ పక్కా అయ్యిందని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో కూడా ఆయన ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.

డబుల్ ఎలిమినేషన్ జరగనున్నదా?

ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు బిగ్ బాస్ అవకాశం ఇస్తాడని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సుమన్ తర్వాత భరణి, సంజనా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సంజనా పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ… అనూహ్యంగా రీతూ చౌదరీ పేరు కూడా తెరపైకి రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఉంటే ఎవరి పేరుపై ఓటమి ముద్ర పడుతుంది? అన్నది అధికారిక ఎపిసోడ్ వచ్చేవరకూ సస్పెన్స్‌గా మిగిలేలా ఉంది. కానీ సుమన్ శెట్టి ఎలిమినేషన్ మాత్రం దాదాపు కన్ఫర్మ్‌గా కనిపిస్తోంది.

ఇక ఈ సీజ‌న్ తుది ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో ఎవ‌రు క‌ప్ దక్కించుకుంటార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుంది. చూస్తుంటే తనూజ‌, క‌ళ్యాణ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు క‌ప్ ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని, క‌ళ్యాణ్ విన్న‌ర్‌గా నిలిస్తే అది చ‌రిత్ర అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.