ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఇండిగో సంక్షోభంతో ఇరుక్కున్న ప్రయాణికులకు ఉపశమనం. రైల్వే అదనపు కోచ్‌లు, టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో సహాయం అందిస్తోంది.
విధాత : ఇండిగో విమాన సర్వీస్ ల రద్దుతో ఎయిర్ పోర్టులలో ఐదు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. 37 రైళ్లకు 116 కోచ్‌లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లలో ప్రయాణికుల సామర్ధ్యాన్ని ఇప్పటికే పెంచింది. తూర్పు రైల్వేశాఖ మూడు రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్ ల సంఖ్యను పెంచింది. నార్తర్న్ రైల్వే శాఖ ఎనిమిది రైళ్లలో థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్ లను పెంచింది. పశ్చిమ రైల్వే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ లను పెంచింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే సెకండ్ ఏసీ కోచ్ లను పెంచింది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు కొనసాగించనుంది. సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చైన్నై, బెంగుళూరుకు టీఎస్ ఆర్టీసీ బస్సులు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ ముందుకొచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శనివారం సాయంత్రం 4:30గంటలకు రెండు ప్రత్యేక బస్సులను చైన్నై, బెంగుళూరుకు నడిపించబోతుంది. ఇప్పటికే బస్సులు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram