Musi Project | మూసీ ప్రాజెక్టు 8గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
Musi Project విధాత: మూసీ నది ఎగువ ప్రాంతం జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో కాజ్‌వేల మీదుగా రుద్రవెల్లి, పోచంపల్లి, సంగెంల వద్ధ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ వరద ఉదృతి నేపధ్యంలో కేతేపల్లి మూసీ ప్రాజెక్టు 8గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ ఆర్.వి.కర్నన్ ప్రాజెక్టును జిల్లా స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ ఖుష్భు గుప్తాతో […]

Musi Project
విధాత: మూసీ నది ఎగువ ప్రాంతం జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో కాజ్‌వేల మీదుగా రుద్రవెల్లి, పోచంపల్లి, సంగెంల వద్ధ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ వరద ఉదృతి నేపధ్యంలో కేతేపల్లి మూసీ ప్రాజెక్టు 8గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు.
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ ఆర్.వి.కర్నన్ ప్రాజెక్టును జిల్లా స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ ఖుష్భు గుప్తాతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు నీటి మట్టం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోలను, దిగువ ప్రాంత ప్రజలకు ఇచ్చిన అప్రమత్తత చర్యలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. శుక్రవారం రాత్రికల్లా ప్రాజెక్టు 8గట్లే నుండి 19,259క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
కుడి కాలువ ద్వారా 46క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 98క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టులోకి 22,099క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అవుట్ ఫ్లో మొత్తం 19,445క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 645అడుగులకుగాను 641.10అడుగులకు చేరింది.