Rahul Gandhi | నా పేరు గాంధీ.. సావార్కర్‌ కాదు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు

మీడియా సమావేశంలో రాహుల్‌ సావార్కర్‌ క్షమాభిక్ష లేఖలపై గతంలోనూ ప్రస్తావన విధాత: గతంలో ఒకసారి హిందూత్వ సిద్ధాంత కర్త వీడీ సావార్కర్‌ (V D Savarkar) వివాదాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ.. శనివారం నాటి తన మీడియా సమావేశంలో మరోసారి ఆయన పేరును తీసుకొచ్చారు. చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నా పేరు సావార్కర్‌ కాదు.. గాంధీ. గాంధీలు క్షమాపణ చెప్పే […]

Rahul Gandhi | నా పేరు గాంధీ.. సావార్కర్‌ కాదు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు
  • మీడియా సమావేశంలో రాహుల్‌
  • సావార్కర్‌ క్షమాభిక్ష లేఖలపై గతంలోనూ ప్రస్తావన

విధాత: గతంలో ఒకసారి హిందూత్వ సిద్ధాంత కర్త వీడీ సావార్కర్‌ (V D Savarkar) వివాదాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ.. శనివారం నాటి తన మీడియా సమావేశంలో మరోసారి ఆయన పేరును తీసుకొచ్చారు. చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నా పేరు సావార్కర్‌ కాదు.. గాంధీ. గాంధీలు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు.

భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో గత ఏడాది నవంబర్‌లో ఒక సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ.. సావార్కర్‌ అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఉత్తరాలు రాసుకుని అండమాన్‌ జైలు నుంచి బయటపడ్డారని, బ్రిటిషర్లు ఇచ్చిన పెన్షన్‌ కూడా తీసుకున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే.

భారతదేశ స్వాతంత్య్రం కోసం ఒకవైపు పోరాటం సాగుతుంటే.. మరోవైపు బ్రిటిషర్లకు సావార్కర్‌ సహాయం చేశారని కూడా రాహుల్‌ ఆరోపించారు. దీనిపై బీజేపీ, శివసేన నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.