సోనియాకు షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ.. వీడియో
విధాత: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కుమారుడు రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే సోనియా షూ లేస్ ఊడిపోవడాన్ని రాహుల్ గమనించారు. దీంతో తల్లి షూ లేస్‌ను రాహుల్ కట్టి, అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. మాండ్యా […]

విధాత: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కుమారుడు రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే సోనియా షూ లేస్ ఊడిపోవడాన్ని రాహుల్ గమనించారు. దీంతో తల్లి షూ లేస్‌ను రాహుల్ కట్టి, అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. మాండ్యా జిల్లాలో కొనసాగుతోన్న పాదయాత్రలో సోనియా పాల్గొన్నారు. పాదయాత్రలో బ్రేక్ తీసుకోవాలని తల్లిని రాహుల్ కోరారు. దీంతో కాసేపు ఆమె కారులో ప్రయాణించింది. అనంతరం తిరిగి పాదయాత్రలో సోనియా భాగస్వాములయ్యారు. ఇక సోనియా, రాహుల్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.