Naga Babu | నిహారిక చేసిన ప‌నికి.. నాగ‌బాబుకి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా?

Naga Babu | టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, డిమాండ్, ఆధిపత్యం గురించి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోలు అంద‌రు మంచి విజ‌యాలు సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ అంటే అంద‌రిలో ప్ర‌త్యే అభిమానం ఏర్ప‌డింది. చిరంజీవి త‌రువాత ఆ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాలు సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌ని ఏలుతుంది. అయితే ఇటీవ‌ల ఈ ఫ్యామిలీ […]

  • By: sn    latest    Jul 07, 2023 10:13 AM IST
Naga Babu | నిహారిక చేసిన ప‌నికి.. నాగ‌బాబుకి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా?

Naga Babu |

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, డిమాండ్, ఆధిపత్యం గురించి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోలు అంద‌రు మంచి విజ‌యాలు సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ అంటే అంద‌రిలో ప్ర‌త్యే అభిమానం ఏర్ప‌డింది. చిరంజీవి త‌రువాత ఆ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాలు సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌ని ఏలుతుంది.

అయితే ఇటీవ‌ల ఈ ఫ్యామిలీ విడాకుల విష‌యంలో ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే మూడు పెళ్లి చేసుకోగా రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఇక శ్రీజ రెండు సార్లు వివాహం చేసుకొని వారిద్ద‌రికి విడాకులు ఇచ్చి సోలోగా ఉంటుంది. ఇక నిహారిక కూడా ఇటీవ‌ల చైత‌న్య నుంచి విడిపోయి పెద్ద షాక్ ఇచ్చింది.

మెగా ఫ్యామిలీలో ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, కొద్ది రోజుల‌కి ఉపాస‌న పాప బార‌సాల వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ శుభ‌వార్త‌ల న‌డుమ ఆ కుటుంబం నుంచి మరో నెగటివ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన భర్త చైతన్య జొన్నల గడ్డతో విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పి నిహారిక పెద్ద షాకే ఇచ్చింది.

చైతన్య జొన్నల్లగడ్డ కుటుంబంతో కలవలేక పోవ‌డం వ‌ల్ల‌నే నిహారిక విడాకులు తీసుకుంద‌ని అంటున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండ‌డం వ‌ల్ల పార్టీలు, పబ్బులు, వెకేషన్ అండ్ ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ గడిపేసిది. అలా ఉండే నిహారిక‌కి ప‌ద్ద‌తిగా ఉండడం క‌ష్టంగా మారింది.

ఇలాంటి పరిణమాల వల్ల చైతన్య- నిహారిక‌కు మధ్య మనస్ఫర్థలు రావ‌డం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఎంతో అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడాకులు తీసుకోవ‌డం వ‌ల‌న నాగ‌బాబు కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

రాజస్థాన్ జైపుర్ ప్యాలెస్ వేదికగా జరిగిన పెళ్లికి దాదాపు రూ. 50 కోట్ల వరకు నాగబాబు ఖర్చు చేశారని టాక్. ఇప్పుడు నిహారిక విడాకుల‌తో నాగబాబుకు రూ.50కోట్లు నష్టం వాటిల్లింది. కూతురు మీద ప్రేమతో ఆమె భవిష్యత్త్ ను దృష్టిలో ఉంచుకుని నాగ‌బాబు విడాకుల‌కి ఒప్పుకున్నాడ‌ని అంటున్నారు.