Viral: ఇలా తయారయారేంట్రా.. ఫుడ్ కోర్టులో పెళ్లేందిరా! వీడియో వైరల్

Viral:
విధాత: పెళ్లి ప్రతి మనిషి జీవితంలో తన జీవితంలో ఒకేసారి జరుపుకునే మరుపురాని వేడుక. వధూవరులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వేద మంత్రాలు..భాజాభజంత్రీల మధ్య సంబరంగా జరుపుకునే చిరస్మరణియ మధురస్మృతి. పవిత్ర వివాహ వేడుక మారుతున్న కాలంలో విచిత్ర పోకడలు పోతోంది. నేటి రోజుల్లో ఎప్పుడు ఎవరితో ప్రేమ పుడుతుందో.. ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెళ్లి చేసుకుంటారో కూడా తెలియని కలికాలం పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా ప్రేమ జంటలు తమ పెళ్లిని పెద్ధలు ఎక్కడ వ్యతిరేకిస్తారోనన్న భయంతో ఏ గుడిలోనే దండలు మార్చేసుకుని తాళి కట్టెసుకునే తతంగం చేసి తమకు పెళ్లియిందనిపిస్తుంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయితే సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అటువంటి వారిలో కొందరు ఆకాశంలో పెళ్లి పేరుతో విమానాల్లోనూ, మరికొందరు భారీ షిప్ లలో, ఇంకొందరు నీటిలో అక్సిజన్ సిలిండర్ లతో వెళ్లి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కొంతమంది ప్రేమజంటలు ఇటీవల కాలంలో అభిమాన హీరోల సినిమాకు వెళ్లి థియేటర్ లోనే ప్రేక్షకుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా చూశాం.
అయితే ఓ ప్రేమజంట మాత్రం ఏకంగా ఓ ఫుడ్ కోర్టులో పెళ్లి తతంగం చేసేసుకుని ఒక్కటైన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఫుడ్ కోర్టులోనే యువతి మెడలో యువకుడు తాళి కట్టేయగా.. ఆ నూతన వధువు సిగ్గులొలికిస్తూ తాళి కట్టించుకుంది. ఆ యువజంట పరిస్థితులు.. ఇబ్బందులు ఏమిటోగాని అంత ఆదరాబాదరగా ఫుడ్ కోర్టులో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది?.. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన పెళ్లి వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు ఎంత ప్రేమికులైతే మాత్రం ఫుడ్ కోర్టులలో పెళ్లి చేసుకునే నిర్వాకం ఏంట్రా నాయనా..అని కొందరు కామెంట్ చేయగా. ఇంకొందరేమో ఒక్క నిముషం తల్లి తండ్రుల గురించి ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకోండి ..వాళ్ల మనసులు ఎంత బాధ పడతాయో అని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట జరిగినట్లు తెలుస్తుండగా.. అ అబ్బాయి అమ్మాయికి కట్టింది నల్ల తాడు అని పుస్తెల తాడు కాదని సోషల్ మీడియాలో చర్చ సైతం జరుగుతుంది. ఇదిలాఉంటే అ నల్ల తాడుతోనే మూడు ముళ్లు వేయడం విశేషం.