Naga Chaitanya | ఇదేం పని చైతూ.. అక్కినేని పరువు తీసేశావ్ పో
Naga Chaitanya | ఆ హీరో రక్తంలోనే నటన ఇమిడి ఉంది. తాత నుంచి తండ్రి వరకూ అంతా గొప్ప నటులే.. తాత విషయానికి వస్తే మొదటి సారి పాటకు స్టెప్పులేసి తెలుగు పాటకు అందాన్ని, అభినయాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇక ఆయన సినిమాలంటే ఇప్పటికీ ఆణిముత్యాలుగా నిలుస్తాయి. తండ్రి విషయం కూడా అంతే ఎక్కడా తన తండ్రికి తీసిపోకుండా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన గ్రీకువీరుడు.. ఇప్పుడు తెలిసిందిగా అతగాడు […]
Naga Chaitanya | ఆ హీరో రక్తంలోనే నటన ఇమిడి ఉంది. తాత నుంచి తండ్రి వరకూ అంతా గొప్ప నటులే.. తాత విషయానికి వస్తే మొదటి సారి పాటకు స్టెప్పులేసి తెలుగు పాటకు అందాన్ని, అభినయాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇక ఆయన సినిమాలంటే ఇప్పటికీ ఆణిముత్యాలుగా నిలుస్తాయి.
తండ్రి విషయం కూడా అంతే ఎక్కడా తన తండ్రికి తీసిపోకుండా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన గ్రీకువీరుడు.. ఇప్పుడు తెలిసిందిగా అతగాడు ఎవరో… ఆ తండ్రీ కొడుకులే అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు అక్కినేని నాగార్జున.
ఈ ఇద్దరు మహానటుల నటన గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే.. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు, నాగార్జున తర్వాత వాళ్ళ వారసులుగా అనుకున్న నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ పెద్ద హీరోలుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోలేకపోయారు. నాగ చైతన్య సంగతి ఏదో కాస్త పరవాలేదు అనుకున్నా, అఖిల్ ఇప్పటికీ డక్కాముక్కీలు తింటూనే ఉన్నాడు. అతని కెరియర్ ఓ గాడిలో పడలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే..
ప్రస్తుతం నాగ చైతన్య చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. నటనలో ఏదో మెళకువల కోసమని పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్లో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యానని అక్కడి ఫోటోస్ నెట్‌లో షేర్ చేశాడు చైతూ. ఇది చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
‘ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఇదేం ఖర్మ’ అని కామెంట్ చేసినవారు కొందరైతే, ‘మంచిదే ఇంకా మంచి నటన నీనుంచి ఆశిస్తున్నాం’ అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆదిశక్తి థియేటర్లో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యేది యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వారు, ఆల్రెడీ హీరోలుగా ఉండి నటించే స్కిల్స్ లేని వాళ్ళు మాత్రమే అక్కడ కోర్స్‌లో ఉంటారు.
ఇదే విషయంగా చైతన్య పెట్టిన పోస్ట్‌కి అతని అభిమానులు, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు అంతా అలా రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. పాపం చైతన్య ఉద్దేశ్యం ఈ విషయంలో ఏమై ఉంటుందో.. ఇంకా నటనలో మెళకులవలతో ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యం కూడా అయి ఉండవచ్చు కదా. ఏదైతేనేం సోషల్ మీడియా జనాలకి మాత్రం చిక్కేశాడు చైతూ.
View this post on Instagram
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram