నాగ చైతన్య సింప్లిసిటీకి ప్రతి ఒక్కరు ఫిదా.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్

అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య హిట్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇంత వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోలేకపోయిన చైతూ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా నాగ చైతన్య నటించిన ఒక్క చిత్రం అయిన వంద కోట్ల క్లబ్‌లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.
అయితే ప్రస్తుతం నాగ చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చేపల వేట సాగించే జాలరి పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఇక ఇందులో కథానాయికగా సాయి పల్లవి కథానాయికగా నటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.
సాయి పల్లవి, చైతూ ఇద్దరు కలిసి గతంలో లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించగా, రెండోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. అయితే నాగ చైతన్యకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. నాగా చైతన్యకి బస్సులు, కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే తన గ్యారేజీలో చాలా మోడల్స్ కార్లు, బైక్స్ ఉండగా, వాటిపై అప్పుడప్పుడు షికారుకి వెళుతుంటాడు. అయితే రీసెంట్‌గా నాగ చైతన్య సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దాంతో చైతూ చాలా సంతోషించి అతని కోరిక మేరకు బైక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చి రైడ్ కూడా చేశారు. దాంతో చైతూ సంబంది చాలా సంతోషించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చైతూ తన సిబ్బందితో ఫొటో దిగేటప్పుడు తన పెట్ రాగా, ఆ పెట్‌ని పక్కకి పంపిన విధానంపై కూడా నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత సోలో జీవితం గడుపుతున్న నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ మధ్య బాగా వార్తలు వినిపించాయి. ఈ సారి సినిమా ఫీల్డ్‌కి సంబంధించిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని చేసుకోవాలని భావిస్తున్నట్టు టాక్.