ఆ ముగ్గురికి హౌజ్‌లో ఉండే అర్హత లేదన్న నాగార్జున.. అందరు షాక్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో శనివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికకరంగా సాగింది.బిగ్‌బాస్ హౌజ్‌కి మొదటి కెప్టెన్‌గా ఎంపికైన పల్లవి ప్రశాంత్‌పై నాగార్జున ప్రశంసలు కురిపించారు. రైతు బిడ్డ కెప్టెన్ కావడం సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. తోటి ఇంటి సభ్యులు కూడా ప్రశాంత్ కెప్టెన్ కావడంపై చప్పట్లతో మెచ్చుకున్నారు. ఇక అమర్‌దీప్ ఏదో కొట్టాలి అన్నట్టుగా కొట్టడంతో నాగార్జున… ‘కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచాడు కాబట్టే పల్లవి ప్రశాంత్‌ను పొగిడాను అమర్.. ఊరికే ఏం కాదులే అంటూ’ మనోడికి బాగానే చురకలు అంటించాడు.ఇక హౌజ్‌మేట్స్ బెస్ట్ బడ్డీలుగా ఏర్పడి గేమ్ ఆడడంతో వాళ్లు చేసిన తప్పుల గురించి నాగార్జున ప్రశ్నించాడు.
ముందుగా అమర్ దీప్-సందీప్‌లని లేపి.. ఈ వీక్‌లో మీకు జరిగిన అన్యాయలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు.వాళ్లు ఏమి లేవన్నట్టు చెప్పగా,అప్పుడు నాగార్జున.. మీకేముంటాయి.. మీ వల్ల ఇతరులకు అన్యాయం జరిగి ఉంటుంది అంటూ మళ్లీ పంచ్ వేశారు. స్మయిలింగ్ బోర్డ్ ఛాలెంజ్‌లో టాస్క్ అవ్వకుండా బెల్ కొట్టడం, ఫ్రూట్ నింజా టాస్క్‌లో సంచాలక్‌గా అమర్ సరిగా వ్యవహరించకపోవడంపై నాగార్జున గట్టిగానే మండిపడ్డారు. వీడియోలు చూపించి తెగ కడిగిపడేశాడు. ఇక యావర్ చేసిన మిస్టేక్‌ని నాగ్ అడగడంతో, ఆ సమయంలో యావర్.. సంచాలక్ సరైన నిర్ణయం తీసుకోలేదని, న్యాయం చేయలేదని చెప్పాడు. శోభా శెట్టి మిస్టేక్ చేసిన నేపథ్యంలో ఆమెకి గట్టి క్లాస్ పీకాడు.
గౌతమ్ కృష్ణ- శుభశ్రీ జోడి చేసిన తప్పుల గురించి అడిగి వారికి కూడా గట్టి క్లాస్ పీకాడు. ఇక శివాజీ-పల్లవి ప్రశాంత్ కూడా కొన్ని తప్పులు చేయగా, వారి తప్పులని ఎత్తి చూపిన నాగార్జున గట్టిగానే వేసుకున్నాడు. ఇక కంటెస్టెంట్లకి ఓ పరీక్ష పెట్టగా, శోభా శెట్టి, ప్రశాంత్, సందీప్ హౌజ్‌మేట్స్ అయ్యారు. కానీ ఏడుగురు మాత్రం కాలేదు. దీంతో ఎలిమినేషన్‌లో ఉన్నట్టు నాగ్ చెప్పారు. అయితే ఈ ఏడుగురిలో ముగ్గురు హౌజ్‌లో ఉండేందుకు ఎందుకు అనర్హులో చెప్పాలని నాగార్జున కోరడంతో ప్రశాంత్.. యావర్, అమర్ దీప్, తేజల పేర్లు చెప్పాడు. సందీప్.. యావర్, శివాజీ, గౌతమ్ పేర్లు చెప్పగా, ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభ శ్రీ పేర్లని, అమర్ దీప్.. శుభ శ్రీ, యావర్, గౌతం పేర్లు చెప్పగా, శుభశ్రీ-గౌతమ్.. తేజ, ప్రియాంక, అమర్ దీప్‌ల పేర్లు తెలిపారు. తేజ.. గౌతమ్ శుభ శ్రీ, అమర్, యావర్.. అమర్, ప్రియాంక, తేజ పేర్లు , శివాజీ.. అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ పేర్లు చెప్పగా, శోభా శెట్టి.. తేజ, గౌతమ్, శివాజీ పేర్లు తెలిపింది. ఇలా మొత్తంగా అమర్ దీప్, యావర్, తేజ లను అనర్హులుగా హౌజ్ తేల్చింది.