Viral Video | రోడ్లపై అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతున్న మహిళ
Naked Woman | ఈ వీడియోను చూస్తే మీరు తప్పకుండా ఆమె దెయ్యమని అనుకుంటారు. అంతే కాదు మీ శరీరంలో వణుకు పుట్టడం ఖాయం. ఒంటిపై ఒక్క బట్ట లేకుండా, వెంట్రుకలు గాలికి వదిలేసి ఆమె నడుస్తుంటే.. గుండెల్లో గుబులు పుడుతోంది. ఇక ప్రతి ఇంటి తలుపు వద్దకు చేరుకుని కాలింగ్ బెల్ కొడుతూ.. అందరినీ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ మహిళ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. […]

Naked Woman | ఈ వీడియోను చూస్తే మీరు తప్పకుండా ఆమె దెయ్యమని అనుకుంటారు. అంతే కాదు మీ శరీరంలో వణుకు పుట్టడం ఖాయం. ఒంటిపై ఒక్క బట్ట లేకుండా, వెంట్రుకలు గాలికి వదిలేసి ఆమె నడుస్తుంటే.. గుండెల్లో గుబులు పుడుతోంది. ఇక ప్రతి ఇంటి తలుపు వద్దకు చేరుకుని కాలింగ్ బెల్ కొడుతూ.. అందరినీ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ మహిళ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆసుప్రతికి తీసుకెళ్లితే ఆడబిడ్డకు జన్మనిచ్చింది..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పట్టణ పరిధిలోని మిలక్ గ్రామంలో.. ఓ మహిళ నగ్నంగా అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతుంది. ఒంటిపై ఒక్క బట్ట కూడా లేదు. ఇక వెంట్రుకలను కూడా కిందకు వదిలేసి తిరుగుతుంది. ఓ ఇంటి వద్దకు వెళ్లిన ఆ మహిళ.. కాలింగ్ బెల్‌ను పదేపదే కొట్టింది.
View this post on Instagram
దీంతో ఆ ఇంటి యజమాని తలుపు తెరిచి చూడగా, షాక్ అయ్యాడు. తలుపు తెరవగానే అక్కడ్నుంచి మహిళ వెళ్లిపోయింది. ఈ ఘటన జనవరి 30వ తేదీన అర్ధరాత్రి 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఆ దృశ్యాలను చూసిన స్థానికులు దెయ్యం అని అనుకున్నారు. కానీ ఆమె దెయ్యం కాదని పోలీసులు తేల్చారు.
అర్ధరాత్రి పూట నగ్నంగా తిరుగుతున్న మహిళ గురించి పోలీసులు విచారించారు. అయితే ఆమె మానసిక సమస్యతో బాధపడుతుందని, రాత్రిళ్లు ఇలాగే చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు నిర్ధారించారు. గత ఐదేండ్ల నుంచి బరేలీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.
ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భయమా..లేక సెంటిమెంటా?
అర్ధరాత్రి సమయాల్లో అలా బయటకు రాకుండా చూడాలని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. ఒక వేళ మళ్లీ ఆ మహిళ బయట కనిపిస్తే తక్షణమే దుస్తులు అందించి, తమకు సమాచారం అందించాలని రాంపూర్ పోలీసులు పేర్కొన్నారు.
Viral Video | రోడ్లపై అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతున్న మహిళ | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/QXS3frErJ8 pic.twitter.com/JeOaP0nkk1
— vidhaathanews (@vidhaathanews) February 5, 2023