Nalgonda | 12సీట్లను జిరో చేసి KCRకు బుద్ధి చెప్పాలి: మాజీ MP బూర నర్సయ్యగౌడ్

Nalgonda బిజెపిలో అంతర్గత తగాదాలు.. అధికార పార్టీ మీడియా సృష్టి మాత్రమే.. ప‌వ‌ర్ ప్లాంట్ ల‌క్ష్యం.. అక్క‌డి భూముల స్వాధీనం విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్మి మొత్తం 12 అసెంబ్లీ సీట్లను బిఆర్ఎస్ కి కట్టబెడితే ఆయన జిల్లా సాగునీటి ప్రాజెక్టులను తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. జిల్లా ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు రానున్న […]

Nalgonda | 12సీట్లను జిరో చేసి KCRకు బుద్ధి చెప్పాలి: మాజీ MP బూర నర్సయ్యగౌడ్

Nalgonda

  • బిజెపిలో అంతర్గత తగాదాలు.. అధికార పార్టీ మీడియా సృష్టి మాత్రమే..
  • ప‌వ‌ర్ ప్లాంట్ ల‌క్ష్యం.. అక్క‌డి భూముల స్వాధీనం

విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్మి మొత్తం 12 అసెంబ్లీ సీట్లను బిఆర్ఎస్ కి కట్టబెడితే ఆయన జిల్లా సాగునీటి ప్రాజెక్టులను తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. జిల్లా ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో జీరో సీట్లను ఇచ్చి బుద్ధి చెప్పాలని కోరారు.

మంగళవారం బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వ‌హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3,000 కోట్ల ఖర్చుతో గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీశైలం సొరంగం ప్రాజెక్టును తొమ్మిదేళ్లుగా నిధులు ఇవ్వకుండా కేసీఆర్ మూల పడేసారన్నారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు, నక్కల గండి ప్రాజెక్టు లను కట్టపై కుర్చీ వేసుకొని మరీ పూర్తి చేయిస్తానని చెప్పి మోసం చేశారన్నారు.

ఇదే సమయంలో 1లక్షా 30,000 కోట్లు పెట్టి కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేవలం 5 టీఎంసీల నీళ్ల కోసం మూడు చెక్ డ్యాములు కట్టారన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పై ఎన్నికల ముందు డ్రామాలు చేస్తూ ఎన్నికలయ్యాక మళ్లీ పట్టించుకోలేద‌న్నారు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ల కింద ఎకరాకు పది లక్షలు ఇచ్చి, మునుగోడు శివన్నగూడ ముంపు బాధితులకు ఐదు లక్షల ఇచ్చి, గోసపెట్టి ఉప ఎన్నిక ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చార‌ని విమ‌ర్శించారు.

అసలు పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఎక్కడి నుండి ఇస్తారో డీపీఆర్ లో పెట్టలేదని, రిజర్వాయర్లు తవ్వించి కమిషన్ లను దండుకుంటున్నారన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు 2000 ఎకరాలు అవసరం ఉండగా, 9500 ఎకరాల గిరిజన భూములను లాక్కున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్లాంట్ వెనుక అసలు లక్ష్యం అక్కడ భూముల స్వాధీనం అన్నారు.

సిరిసిల్ల, గజ్వేల్ కు వేల కోట్లు ఖర్చు చేస్తూ నల్గొండ పట్టణంలో పై మెరుగులు అద్దుతూ మభ్యపెడుతున్నారన్నారు. ఇక్కడ యువతకు ఒక్క పరిశ్రమ గాని, ఐటి టవర్ గానీ తీసుకురాలేదన్నారు. దూరాన వున్న ఖమ్మం అభివృద్ధి చెందగా, హైదరాబాద్ పక్కనే ఉన్న 12 సీట్లు ఇచ్చిన నల్గొండ జిల్లాలో మాత్రం కొత్తగా పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు రాలేదన్నారు. గతంలో ఉప ఎన్నికల కోణంలోనే సూర్యాపేట, నల్లగొండ లకు మెడికల్ కళాశాలలను కేసీఆర్ మంజూరు చేశారన్నారు.

కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్నారు. జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పంచభూతాలైన సహజ వనరులను దోచుకుంటూ హైదరాబాదులో దాచుకుంటున్నారన్నారు. జిల్లాలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా వారిని తొమ్మిదేళ్లుగా అణచివేస్తూ బీసీ ఫెడరేషన్లు లేక నిధులు ఇవ్వక గోస పెడుతున్నారన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదన్నారు. 18 లక్షల కోట్ల బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ మేరకు రెండు లక్షల 76 వేల కోట్లు ఎస్సీలకు ఇవ్వాల్సి ఉండగా దళిత బంధు పేరుతో ఓట్ల రాజకీయం చేస్తూ అందులోనూ 30 శాతం కమిషన్ దోచుకుంటున్నారన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో 100% కమీషన్ ప్రభుత్వం అన్నారు. రైతులను కూడా వదలకుండా బస్తాకు ఆరు కిలోల తరుగు పేరుతో దోచుకుంటుందన్నారు. ఒక పంటకు 10 కోట్ల క్వింటాల్సులో ఒక కోటి క్వింటాల్ ధాన్యం తరుగు పేరుతో దోపిడీ చేయబడుతుందన్నారు. ఇందులో పంటకు రెండు వేల కోట్ల అవినీతి సాగుతుందని ప్రగతి భవన్ నుండి మంత్రులు ,ఎమ్మెల్యేలు, మిల్లర్ల దాకా ఇందులో వాటా ఉందన్నారు. రైతుల శ్రమతో కూడిన రక్తం కూడా బిఆర్ఎస్ వదలడం లేదన్నారు.

ఒక్క రైతుబంధు పేరు చెప్పి 14 పథకాలు ఎగవేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తే తామే చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు పోతుందన్నారు. కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా బియ్యం రీసెలింగ్ చేస్తూ ప్రగతిభవన్ నుండి మిల్లర్ల దాకా భారీ స్కాం చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని, పంట నష్టపరిహారం ఇస్తామని ఇవ్వలేదని, ఇన్ని అబద్ధాలు చెబుతున్న కేసిఆర్ కు తెలంగాణ ప్రజల పౌరుషం చూపాల్సిన సమయం వచ్చిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు తమ చైతన్యాన్ని చాటి ఒక్క సీటు కూడా టిఆర్ఎస్ కు ఇవ్వకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో పోస్ట్పెయిడ్ బ్యాచ్ గా మారి ఎన్నికల పిదప అమ్ముడుపోయారన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తో ముందస్తు లాలూచీ పెట్టుకొని ఫ్రీ పెయిడ్ బ్యాచ్ గా పని చేస్తున్నారన్నారు.

అమ్ముడు పోయే కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లతో కొట్టాలన్నారు. బిజెపి గెలిస్తే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి సొమ్మును బిజెపి ప్రభుత్వం కక్కిస్తుందన్నారు. 12 సీట్లు ఇచ్చిన జిల్లాకు అన్యాయం చేసిన కేసీఆర్కు జీరో సీట్లు ఇవ్వాలన్నారు. బిజెపి వస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఇండస్ట్రీలకు పెద్దపీట వేస్తుందన్నారు.

జిల్లాలో ఎమ్మెల్యేల ఇసుక దంధాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. బిజెపి ఆర్గనైజ్డ్ బేస్, కేడర్ బేస్ పార్టీ అని ఇందులో ఎవరు తురుముఖాన్ కారని బూతు ప్రెసిడెంట్, కేడర్ మాత్రమే సుప్రీమ్ అన్నారు. బిజెపిలో అంతర్గత తగాదాలు అధికార పార్టీ మీడియా సృష్టి మాత్రమే అన్నారు.