Nalgonda: తెలంగాణ చరిత్ర, నైజాం దురాగతాలు.. నేటి సమాజానికి తెలియకపోవడం బాధాకరం: కసిరెడ్డి
Nalgonda అమృతోత్సవాల స్ఫూర్తితో సంఘటిత శక్తిగా ముందుకు సాగాలి విధాత: నిజాం పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవాల స్ఫూర్తితో సంఘటిత శక్తిగా ముందుకు సాగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలలో భాగంగా నల్లగొండ(Nalgonda) పట్టణ ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. లక్షలాది మంది హిందువుల వీరోచిత పోరాటాలతో, […]

Nalgonda
అమృతోత్సవాల స్ఫూర్తితో సంఘటిత శక్తిగా ముందుకు సాగాలి
విధాత: నిజాం పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవాల స్ఫూర్తితో సంఘటిత శక్తిగా ముందుకు సాగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలలో భాగంగా నల్లగొండ(Nalgonda) పట్టణ ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. లక్షలాది మంది హిందువుల వీరోచిత పోరాటాలతో, రక్తతర్పణలతో, బలిదానాలతో తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి ఈ భూమిని విముక్తి చేసుకోని స్వాతంత్య్రం సాధించుకున్నామన్నారు.
స్వతంత్ర ఉస్మాన్ స్థాన్ ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఏడవ నిజాం నవాబు కలలను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ఆపరేషన్ పోలోతో వమ్ము చేసి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి అయినప్ప టికీ తెలంగాణ చరిత్ర, నైజాం దురాగతాలు నేటి సమాజానికి తెలియకపోవడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు.
నిజాం విముక్త పోరాట చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఏ సమాజానికి అయినా ఆ సమాజ చరిత్ర తెలియకపోతే ఆ సమాజం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు.
నిజాం నవాబు పాలనలో రజాకర్ల సైన్యం నవాబుకు ప్రవైటు సైన్యంగా మారి గ్రామాలపై పడి లూటీలు, గృహదహనాలు, స్రీలపై అత్యాచారాలకు, అపహరణలకు పాల్పడి, హిందూ స్త్రీలను వివస్త్రలను చేసి బతుకమ్మలను ఆడించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నప్పటికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిమ్మకు నీరెత్తినట్లుగా పరిపాలన కొనసాగించిన మూర్ఖుడని అన్నారు.
నిజాం రాచరిక పాలన మతోన్మాద పాలనగా మారి కనీసం మానవ హక్కులు దక్కని స్థితిలో తిరగబడిన హిందూ సమాజం నిజాం విముక్త పోరాటం సాగించిన తీరు చారిత్రాత్మకమన్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తితో సంఘటిత శక్తిగా తెలంగాణ సమాజం చైతన్యవంతమై సాగాలన్నారు.
నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఇటికాల కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గార్లపాటి వెంకటయ్య, డాక్టర్ చకిలం ఫణికుమార్, కుంభం మోహన్ రెడ్డి, కుర్మిళ్ళ రాంప్రసాద్, నర్రా వెంకట శివకుమార్, బంటు జనార్థన్, నూకల జైపాల్ రెడ్డి, అగ్ని, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.