Khammam | ఖమ్మం టికెట్‌కు నందిని దరఖాస్తు
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. 17ఎంపీ సీట్లకు వందల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి

- నాగర్ కర్నూల్ రేసులో మల్లు రవి, కుమారుడు సిద్ధార్ధలు
Khammam | విధాత: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. 17ఎంపీ సీట్లకు వందల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. కాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం లోక్‌సభ సీటు టికెట్ కోసం తన అనుచరుల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం సీటు నాదేనని ఇప్పటికే మాజీ ఎంపీ రేణుకాచౌదరి స్పష్టం చేశారు. అయినప్పటికి నందిని దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు నాగర్ కర్నూల్ సీటు టికెట్ కోసం భట్టి విక్రమార్క సోదరుడు మల్లురవి, ఆయన కుమారుడు మల్లు సిద్ధార్థలు దరఖాస్తు చేసుకున్నారు. మల్లు రవితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్‌ను మల్లు రవికే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన మల్లురవికి ఎంపీ టికెట్ కేటాయించాల్సిన అవసరముందన్నారు.