Telangana Cabinet | సంప్ర‌దాయానికి భిన్నంగా.. 18న మేడారంలో కేబినెట్ భేటీ..!

Telangana Cabinet | ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. అదేదో స‌చివాల‌యం లేదా పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లేదా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేబినెట్ భేటీ జ‌రుగుతుంది అనుకునేరు.

  • By: raj |    telangana |    Published on : Jan 13, 2026 7:38 AM IST
Telangana Cabinet | సంప్ర‌దాయానికి భిన్నంగా.. 18న మేడారంలో కేబినెట్ భేటీ..!

Telangana Cabinet | హైద‌రాబాద్ : ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. అదేదో స‌చివాల‌యం లేదా పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లేదా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేబినెట్ భేటీ జ‌రుగుతుంది అనుకునేరు. ఈ సారి సంప్ర‌దాయానికి భిన్నంగా ములుగు జిల్లా మేడారంలో కేబినెట్ భేటీ నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

18న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, అధికార యంత్రాంగం హాజ‌రు కానున్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్​ భేటీ నిర్వహించనున్నట్లు తెలిసింది.

18న సీఎం షెడ్యూల్ ఇదే..!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో సీఎం ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. త‌ద‌నంత‌రం కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకలకు సీఎం హాజరవుతారు. అదే రోజున సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం జ‌రిగే అవ‌కాశం ఉంది. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్​కు తిరుగు పయనమవుతారు.