Nara Bhuvaneswari | టీడీపీ ముఖ్యనేతలతో భువనేశ్వరి భేటీ

Nara Bhuvaneswari | పార్టీ సారధ్యంపై జోరందుకున్న ఊహాగానాలు లోకేశ్ అరెస్టయితే యువగళం సారధిగా బ్రాహ్మణి వైసీపీ రాజకీయాలను తలపిస్తున్నటీడీపీ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో అక్కా చెలెళ్ల రాజకీయ సమరం విధాత, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు రిమాండ్ నేపధ్యంలో నైరాశ్యంలో ఉన్న టీడీపీ శ్రేణులను, పార్టీని ముందుకు నడిపేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కీలకంగా వ్యవహారించనున్నట్లుగా తెలుగు తమ్ముళ్లలో ఊహాగానాలు..చర్చలు జోరందుకు న్నాయి. బుధవారం చంద్రబాబు […]

  • By: krs    latest    Sep 13, 2023 3:40 PM IST
Nara Bhuvaneswari | టీడీపీ ముఖ్యనేతలతో భువనేశ్వరి భేటీ

Nara Bhuvaneswari |

  • పార్టీ సారధ్యంపై జోరందుకున్న ఊహాగానాలు
  • లోకేశ్ అరెస్టయితే యువగళం సారధిగా బ్రాహ్మణి
  • వైసీపీ రాజకీయాలను తలపిస్తున్నటీడీపీ పరిణామాలు
  • ఏపీ రాజకీయాల్లో అక్కా చెలెళ్ల రాజకీయ సమరం

విధాత, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు రిమాండ్ నేపధ్యంలో నైరాశ్యంలో ఉన్న టీడీపీ శ్రేణులను, పార్టీని ముందుకు నడిపేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కీలకంగా వ్యవహారించనున్నట్లుగా తెలుగు తమ్ముళ్లలో ఊహాగానాలు..చర్చలు జోరందుకు న్నాయి. బుధవారం చంద్రబాబు అరెస్టు పరిణామాలు, భవిష్యత్ రాజకీయ కార్యాక్రమాలపై టీడీపీ ముఖ్య నేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు. భువనేశ్వరి తన కుమారుడు పార్టీ యువనేత నారా లోకేశ్‌తో కలిసి ఈ సమావేశానికి హాజరవ్వడం సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా రేపింది.

చంద్రబాబును జైలులో కలిసిన మరుసటి రోజున భువనేశ్వరి టీడీపీ ముఖ్యుల సమావేశానికి హాజరు కావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల్లో కనిపించకపోవడం, జోక్యం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉన్న భువనేశ్వరి ఇప్పుడు బాబు అరెస్టు నేపధ్యంలో పార్టీ సమావేశానికి హాజరు కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చంద్రబాబు సూచనతోనే ఆమె పార్టీ భేటీకి హాజరైనట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు కావడం, మునుముందు లోకేశ్ ను కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయవచ్చన్న అంఛనాల క్రమంలో పార్టీని కోడలు నారా బ్రాహ్మణితో కలిసి ముందుకు నడిపించాలన్న లక్ష్యంతోనే భువనేశ్వరీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయవచ్చని భావిస్తున్నారు.

వైసీపీ బాటలోనే

గతంలో ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల్లో జైలుకు వెళ్లిన సందర్భంలో ఆయన పాదయాత్రను చెల్లెలు షర్మిల కొనసాగించిన వైనాన్ని, పార్టీ వ్యవహారాలను తల్లి వైఎస్ విజయమ్మ పర్యవేక్షించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అదే తరహాలో అత్తా భువనేశ్వరి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని, లోకేశ్ అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోకుండా బ్రాహ్మణి పాదయాత్రను ముందుకు తీసుకెలుతారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది.

అయితే తాజాగా బాలకృష్ణ నేను వస్తున్నానని, పార్టీ కేడర్ అధైర్యపడవద్ధని రాష్ట్ర మంతా పర్యటిస్తానని ప్రకటించారు. ఇప్పుడు భువనేశ్వరీ కొత్తగా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఈ పరిణామాలు పార్టీలో కొంత గందరగోళాన్ని రేపాయి. అయితే జైలులో చంద్రబాబును కలిసిన సందర్భంలో ఆయన ఇచ్చిన డైరక్షన్ మేరకే భువనేశ్వరి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించేందుకు ముందుకు వచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బాలకృష్ణ కంటే భువనేశ్వరి, బ్రాహ్మణీల ఆధ్వర్యంలో టీడీపీ ప్రజల్లోకి వెళితే తన అరెస్టు పరిణామాల సానుభూతిని ప్రజల నుంచి అందుకోవచ్చని, అది రానున్న ఎన్నికల్లో టీడీపీకి కలిసివస్తుందన్న రాజకీయ వ్యూహంతో చంద్రబాబు అత్తా కోడళ్ల పాచికను తెరపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు.

అదే జరిగితే మునుముందు ఏపీ రాజకీయాల్లో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న అక్క పురంథరేశ్వరి, టీడీపీ నుంచి చెల్లి భువనేశ్వరిల మధ్య మరో ఆసక్తికర రాజకీయ సమరం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీ పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో అరెస్టు వెనుక బీజేపీ ప్రోద్భలం కూడా ఉందన్న ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది.