Mlc Sripal Reddy: CM రేవంత్ రెడ్డిని కలిసిన.. నూత‌న‌ టీచర్స్ MLC శ్రీపాల్ రెడ్డి

  • By: sr    latest    Mar 06, 2025 4:11 PM IST
Mlc Sripal Reddy: CM రేవంత్ రెడ్డిని కలిసిన.. నూత‌న‌ టీచర్స్ MLC శ్రీపాల్ రెడ్డి

Mlc Sripal Reddy | CM Revanth Reddy

విధాత, వెబ్ డెస్క్ : వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ (Teachers’ MLC)గా విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డిని అభినందించిన రేవంత్ రెడ్డి శాలువతో ఆయనను సన్మానించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని సీఎంకు శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్ టీయూ ఎస్ నుంచి పోటీ చేసిన పింగిళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ సిటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా విజయం సాధించారు. మహబూబాబాద్ కు చెందిన శ్రీ పాల్ రెడ్డి పీఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా 2019నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జీవో 317సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు శ్రీపాల్ రెడ్డి మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.