Viral Video | పెళ్లి వేదికపైనే రొమాన్స్‌లో జంట.. ఆ తర్వాత ఏమైందంటే..?
Viral Video | పెళ్లి అనగానే నూతన వధూవరులిద్దరికి గుర్తు వచ్చేది ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ఫోటో షూట్స్. ఈ ఫోటో షూట్స్ చేస్తుంటే చాలా సరదా ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అంతే కాదు పలు జంటలు వార్తల్లో కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఓ జంట కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. పెళ్లి వేదికపైనే నూతన వధూవరులిద్దరూ.. రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన […]

Viral Video | పెళ్లి అనగానే నూతన వధూవరులిద్దరికి గుర్తు వచ్చేది ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ఫోటో షూట్స్. ఈ ఫోటో షూట్స్ చేస్తుంటే చాలా సరదా ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అంతే కాదు పలు జంటలు వార్తల్లో కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఓ జంట కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
పెళ్లి వేదికపైనే నూతన వధూవరులిద్దరూ.. రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆ జంట.. డ్యాన్స్ చేస్తుండగా, వరుడు వధువు లెహంగాను అనుకోకుండా తొక్కేశాడు. దీంతో వధువు కింద పడిపోతుంది. వరుడు కూడా ఆమెపై పడిపోతాడు. అనుకోకుండా జరిగిన ఈ రొమాంటిక్ సీన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డిసెంబర్ 15వ తేదీన జైపూర్ ప్రీ వెడ్డింగ్స్ అనే ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. 12.6 మిలియన్ల మంది వీక్షించగా, 5 లక్షల మంది లైక్ చేశారు.
ఆ జంట కచ్చితంగా లవ్‌లో పడిపోయిందని కొందరు కామెంట్ చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం భయంతో కూడినది.. అందుకేనేమో పెళ్లి రోజే వారు లవ్‌లో పడిపోయారని ఇంకొందరు పేర్కొన్నారు. భార్యను బాగానే బ్యాలెన్స్ చేశాడని కొందరు చమత్కరించారు.
View this post on Instagram