Opposition meet | ప్రతిపక్షాల భేటీ.. బెంగళూరులో 17-18 తేదీల్లో: కేసీ వేణుగోపాల్
Opposition meet తేదీ మార్చిన ప్రతిపక్షాల నేతలు కాంగ్రెస్ నేత వేణుగోపాల్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తదుపరి భేటీ ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అప్రజాస్వామిక, ఫాసిస్టు శక్తులను ఓడించాలన్న విషయంలో తామంతా దృఢంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘పెద్ద ఎత్తున విజయవంతం అయిన పాట్నా భేటీ తర్వాత మేం మా తదుపరి సమావేశాన్ని బెంగళూరులో 17-18 తేదీల్లో నిర్వహించనున్నాం’ […]

Opposition meet
- తేదీ మార్చిన ప్రతిపక్షాల నేతలు
- కాంగ్రెస్ నేత వేణుగోపాల్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తదుపరి భేటీ ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అప్రజాస్వామిక, ఫాసిస్టు శక్తులను ఓడించాలన్న విషయంలో తామంతా దృఢంగా ఉన్నామని పేర్కొన్నారు.
‘పెద్ద ఎత్తున విజయవంతం అయిన పాట్నా భేటీ తర్వాత మేం మా తదుపరి సమావేశాన్ని బెంగళూరులో 17-18 తేదీల్లో నిర్వహించనున్నాం’ అని ఆయన తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకుపోవడంపై స్పష్టమైన దృక్కోణాన్ని ప్రకటిస్తామని చెప్పారు.
గతంలో ఈ సమావేశం జూలై 13-14 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఆ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో తేదీలు ముందుకు జరిపినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి