Nirmal | తై బజారు రుసుం రూ.60.. అడిగాడని కొట్టి చంపారు

Nirmal విధాత, ఆదిలాబాద్: కేవలం 60 రూపాయల కోసం మొదలైన గొడవ ఒకరి మృతికి కారణమైన ఘటన నిర్మల్(Nirmal) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మామడ మండల కేంద్రంలో ప్రతి బుధవారం మేకల సంత నిర్వహిస్తుంటారు. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి గ్రామాల ప్రజలు మేకలను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం పెంబి గ్రామానికి చెందిన మల్లేశ్, శివరామిరెడ్డి, సాయన్న అనే ముగ్గురు వ్యక్తులు సంతలో 6 మేకలను కొనుగోలు చేశారు. అయితే సంతలో […]

  • By: krs    latest    May 04, 2023 8:36 AM IST
Nirmal | తై బజారు రుసుం రూ.60.. అడిగాడని కొట్టి చంపారు

Nirmal

విధాత, ఆదిలాబాద్: కేవలం 60 రూపాయల కోసం మొదలైన గొడవ ఒకరి మృతికి కారణమైన ఘటన నిర్మల్(Nirmal) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మామడ మండల కేంద్రంలో ప్రతి బుధవారం మేకల సంత నిర్వహిస్తుంటారు. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి గ్రామాల ప్రజలు మేకలను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు.

ఈ క్రమంలో గురువారం పెంబి గ్రామానికి చెందిన మల్లేశ్, శివరామిరెడ్డి, సాయన్న అనే ముగ్గురు వ్యక్తులు సంతలో 6 మేకలను కొనుగోలు చేశారు. అయితే సంతలో కొనుగోలు చేసిన ఒక మేకకు 10 రూపాయల చొప్పున తై బజారుకు చెల్లించాల్సి ఉండగా తై బజారు వసూలు చేసే వ్యక్తి మున్ను(షేక్ చాంద్) డబ్బులు చెల్లించాలని కోరాడు.

అయితే గత వారం క్రితం కూడా వీరు మామడ సంతలో మేకలు కొనుగోలు చేసి తై బజార్ రుసుం చెల్లించకుండానే వెళ్లిపోయారు. మళ్ళీ ఆ ముగ్గురే సంతకు రావడంతో.. తై బజార్ నిర్వాహకుడు చాంద్ మొన్న కూడా డబ్బులు చెల్లించకుండా వెళ్లారని ఈ సారి తప్పనిసరిగా రుసుం కట్టాలన్నాడు. దీంతో వారి మధ్య వివాదం రాజుకొంది.

ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి కోపోద్రిక్తులైన కొనుగోలుదారులు మున్ను తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు మున్ను కుటుంబానికి న్యాయం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. వెంటనే సీఐ,ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.